Telangana: పంచాయతీ ఎన్నికలపై సర్కార్‌ కీలక నిర్ణయం!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం.

New Update
CM Revanth Reddy: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్‌ జీతాలకు నిధులు విడుదల

Telangana: పంచాయితీ ఎన్నికల కోసం రేవంత్ ప్రభుత్వం చివరి కసరత్తులు మొదలు పెట్టింది. జనవరి 14న పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనపడుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. మూడు ఫేజుల్లో పంచాయితీ ఎన్నికలు జరుగుతాయి. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మినిమం ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 

Also Read: దారుణం.. అంబులెన్స్‌లోనే బాలికపై గ్యాంగ్‌రేప్.. ఆపై ఏం చేశారంటే?

ముగ్గురు ఎంపీటీసీలతో ఎంపీపీలున్న మండలాల్లో ఎంపీటీసీల సంఖ్యను ఐదుకు పెంచాలని నిర్ణయించింది.వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వచ్చే పంచాయితీ ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయాలని ఆలోచన చేస్తుంది. ఆ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బిల్లు ప్రవేశ పెట్టనుంది.

Also Read: Rains: ఏపీకి తప్పిన తుపాను ముప్పు..ఈరోజు, రేపు భారీ వర్షాలు!

కాగా.. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో కుల గణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు ఉంటాయని  సీఎం రేవంత్‌ తాజాగా చెప్పారు. 

కొత్త బీసీ కమిషన్‌ను...

దీనికి అనుగుణంగానే కుల గణన కోసం ముందుగా కొత్త బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతమున్న కమిషన్‌ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. కొత్త కమిషన్‌ చైర్మన్‌, సభ్యులపై సీఎం రేవంత్‌ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also Read: తెలంగాణకు కేంద్రం మరో తీపి కబురు.. అక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

త్వరలో కొత్త కమిషన్‌ను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఇటీవల మీడియాతో చెప్పారు. దీంతో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. కాగా బీసీ కమిషన్‌ ఏర్పాటైన వెంటనే యుద్ధ ప్రాతిపదిక కుల గణన మొదలు పెట్టింది. కుల గణనకు అవసరమైన విధివిధానాలు, నమూనాలు, పద్ధతులు, సర్వే ప్రశ్నలపై ప్రభుత్వం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం.

 ఇప్పటికే సీఎం బిహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చేపట్టిన కుల గణనపై అధ్యయనం చేశారు. కుల గణనకు అవసరమైన నిధుల్ని సమకూర్చాలని ఆర్థిక శాఖకు సమాచారాన్ని చెప్పిన్నట్లు తెలుస్తుంది.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిధుల కేటాయింపునకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తన పనిలో తానుంది. వార్డుల వారిగా ఓటర్ల వివరాలు తెప్పించే పని మొదలుపెట్టింది. గురువారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలిచ్చారు.

Also Read: ప్రయాణించే రైళ్లు ఆలస్యంగా వెళ్తే నష్టపరిహారం పొందొచ్చు.. ఎలాగంటే?

కుల గణనకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ప్రక్రియను పరిశీలిస్తే.. తెలంగాణలో రెండు నుంచి ఆరు నెలల సమయంలో కుల గణన పూర్తి చేసేయోచ్చు. అయితే యుద్ధప్రాతిపదికన చేపడితే రెండు నెలల్లో పూర్తి చేయవచ్చుననే ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ కసరత్తునంతా బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలో జరగాలి.

అప్పుడే దానికి చట్టబద్ధత ఉంటుంది. డిసెంబరు, జనవరి మొదటి వారంలో ఇదంతా పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వాధికారులు వివరించారు. ఎన్నికలకు 15 రోజుల ముందుగా షెడ్యూల్‌ వెలువడుతుంది. ఈ లెక్కన జనవరి నెల చివరి వరకు రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ముగిసే అవకాశాలున్నాయి. ఇక రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది.

ఒకటి రెండు నెలల్లో ఈ ప్రక్రియ ను పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తే.. కాంగ్రెస్‌ కి ప్రజల నుంచి సానుకూలత ఉంటుందని, ఆ దిశగా ముందుకెళ్లాలని ఆలోచిస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు