Rain Alert : ఏపీకి తప్పిన తుపాను ముప్పు..ఈరోజు, రేపు భారీ వర్షాలు! బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుపానుగా మారలేదు.శుక్రవారం ఉదయం వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.శుక్ర, శనివారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. By Bhavana 29 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Rains:బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుపానుగా రూపాంతరం చెందలేదు.ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలీకి 200 కి.మీ , నాగపట్టణానికి 340, పుదుచ్చేరికి 410, చెన్నైకి 470 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. Also Read: తెలంగాణకు కేంద్రం మరో తీపి కబురు.. అక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ శుక్రవారం ఉదయం వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందని, సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడుతుందని భారత వాతావరణశాఖ పేర్కొంది. వాయవ్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికల్లా కరైకల్ , మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని తెలిపింది. భారీ నుంచి అతి భారీ.. వాయుగుండం ప్రభావంతో శుక్ర, శనివారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు రావొచ్చని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంఓ వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. Also Read: దారుణం.. అంబులెన్స్‌లోనే బాలికపై గ్యాంగ్‌రేప్.. ఆపై ఏం చేశారంటే? మరోపక్క, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంపై భారతఅంతరిక్ష పరిశోధన సంస్థ ప్రభుత్వానికి నిరంతంర సంకేతాలిస్తోంది.ఈవోఎస్ -06 ఇన్సాట్ -3డీఆర్ ఉపగ్రహాలు ఫంగన్ తుపాను సమాచారాన్ని అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి రోజురోజుకు పెరుగుతుంది. దీంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పడిపోతున్నాయి. దీంతో కొన్నిచోట్ల రాత్రి వేళ ఉష్ణోగ్రతలు 13 నుంచి 14 డిగ్రీల వరకూ నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. పగటి వేళ కూడా అత్యల్పంగా 20 నుంచి 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే రోజుల్లో చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. Also Read:ఫుడ్ పాయిజన్ కుట్ర ఆర్‌ఎస్పీదే.. వెలుగులోకి సంచలనాలు! వాతావరణంలో మార్పుల నేపథ్యంలో వైరల్ వ్యాధులుతో పాటు , సీజనల్ వ్యాధులు కూడా మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు. అలాగే జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్తమా, సీవోపీడీ వంటి సమస్యలతో బాధపడేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మూడు పూటలా వేడి ఆహారమే తీసుకోవాలని సూచిస్తున్నారు. చలికాలంలో ఆహారం, నీటితో అంటువ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్నందున.. కాచి చల్లార్చిన గోరు వెచ్చని నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. Also Read: Konda Surekha: కొండా సురేఖకు బిగ్ షాక్.. నాంపల్లి కోర్టు సమన్లు జారీ! ఉదయం పూట వాకింగ్ వెళ్లే అలవాటు ఉన్నవారు కూడా..ఎండ వచ్చాక వాకింగ్ వెళ్లడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. పొగమంచు కారణంగా శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. అందుకే కాస్త ఎండ వచ్చాక వాకింగ్ చేయడం బెటరని వైద్యులు సూచిస్తున్నారు. అలా వీలుకాని పక్షంలో సాయంత్రం పూట అయినా సరే వ్యాయామం చేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.ఇక ఉదయం పూట చలికి ప్రయాణాలు చేసేవారు,ఇతర పనుల మీద బయటకు వచ్చేవారు కూడా ఉన్ని దుస్తులు వేసుకోవాలని.. వీలైతే చేతులకు గ్లౌజులు, ముక్కు, చెవులు మూసే విధంగా మంకీ క్యాపులు ధరించాలని వైద్యులు చెబుతున్నారు. ఇంట్లో ఏడాదిలోపు చిన్నారులు ఉంటే వ్యక్తిగత శుభ్రతకు మరింత ప్రాధాన్యమివ్వాలని.. చేతులను శుభ్రపరుచుకున్న తర్వాతే పసిపిల్లలను ఎత్తుకోవాలని వైద్యులు అంటున్నారు. అలాగే వీలైనంత వరకూ బయట తిప్పకపోవటమే మంచిదని చెప్తున్నారు. భోజనం చేసేముందు చేతులు శుభ్రపరుచుకోవడం.. బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత సబ్బుతో కాళ్లూ, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెబుతున్నారు. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మంచి ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. #low-pressure #bay-of-bengal #weather-updates #AP Cyclone #ap-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి