వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు సొంత జిల్లా కడపలో బిగ్ షాక్ తగిలింది. కడప నగర పాలక సంస్థకు చెందిన 8 మంది కార్పొరేటర్లు, నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్.మాధవి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇది కూడా చదవండి: కేటీఆర్ నేను బాగా క్లోజ్.. దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు! మారుతున్న కడప కార్పొరేషన్ రాజకీయం.🔥జగన్ రెడ్డి సొంత జిల్లాలో వైసీపీకి షాక్! పది మంది వైసీపీ కార్పొరేటర్లు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక..రాబోయే ఎన్నికల్లో కడప కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడమే టీడీపీ లక్ష్యంగా పని చేస్తున్న @ReddeppagariSVR & @R_Madhavi_Reddy… pic.twitter.com/iAvLh2vbXF — Venugopalreddy Chenchu (TDP Official Spokesperson) (@venuchenchu) December 16, 2024 ఇది కూడా చదవండి: లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు.. ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లు వీరే.. 2వ డివిజన్ కార్పొరేటర్ M. సుబ్బారెడ్డి 3వ డివిజన్ కార్పొరేటర్ M. మానస6వ డివిజన్ కార్పొరేటర్ E. నాగేంద్ర 8వ డివిజన్ కార్పొరేటర్ A. లక్ష్మీదేవి25వ డివిజన్ కార్పొరేటర్ K. సూర్యనారాయణ రావు32వ డివిజన్ కార్పొరేటర్ S.B. జఫ్రుల్లా 42వ డివిజన్ కార్పొరేటర్ C. స్వప్న 50వ డివిజన్ కార్పొరేటర్ K. అరుణ ప్రభ ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ వస్తున్న పవన్..! గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప సీటును టీడీపీ కైవసం చేసుకుంది. ఆర్ మాధవి అక్కడ టీడీపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే.. అక్కడ వైసీపీ మేయర్ ఉండడంతో తరచుగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మెజార్టీ కార్పొరేటర్లను చేర్చుకుని మేయర్ కు షాక్ ఇవ్వాలని ఎమ్మెల్యే మాధవి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో కడప కార్పొరేషన్ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇది కూడా చదవండి: రాష్ట్రపతి రాకతో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లొద్దు