TG News: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణకు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి మంగళవారం వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల17 నుంచి 21వరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ద్రౌపది ముర్ము 5 రోజులు సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలులో.. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య హకీంపేట ఎయిర్‌పోర్టు, బొల్లారం చెక్‌పోస్ట్, యాప్రాల్రోడ్, అమ్ముగూడ, బేగంపేట ఫ్లైఓవర్, పంజాగుట్ట, లోతుకుంట, టివోలి జంక్షన్, యశోద ఆస్పత్రి, రాజ్‌భవన్ రసూల్‌పురా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. వాహనాలు దారులు ట్రాఫిక్ ఆంక్షలు పాటించాలని అడిషనల్సీపీ విజ్ఞప్తి చేశారు. 20, 21 తేదీల్లో అమ్ముగూడ, లోతుకుంట, తిరుమలగిరి, బేగంపేట, పంజాగుట్ట ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ముగుస్తాయని వెల్లడించారు. ఏపీలోని గన్నవరం నుంచి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక విమానంలో హకీంపేటలోని వాయుదళ శిక్షణ కేంద్రానికి సాయంత్రం 5:15కు చేరుకుంటారు. అక్కడ గవర్నర్, తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, అధికారులు రాష్ట్రపతిని ఆహ్వానించి పరిచయం అనంతరం ద్రౌపదీ ముర్ము.. భారీ కాన్వాయ్‌తో రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. ఈ నెల 21వ తేదీ వరకు ఇక్కడే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభిస్తారు. శుక్రవారం 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం, అధికారులు, పౌరులతో ఎట్ హోం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ అధికారులు పాల్గొంటారు. ఇది కూడా చదవండి: నారాయణ స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్య.. ఏమైందో తెలుసా..?