సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వస్తున్నారు. ఈ మేరకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఇంటికి వెళ్లనున్న పవన్.. ఆ తర్వాత అల్లు అర్జున్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. బన్నీ కోసం పవన్.. ఈ క్రమంలో అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత జరిగిన పరిణామాలను పవన్‌కు వివరించనున్నారని, ముఖ్యంగా కోర్టు కేసు గురించి చర్చించనున్నట్లు సమాచారం. కాగా గత కొంతకాలంగా మెగా - అల్లు ఫ్యామిలీస్ మధ్య విభేదాలు ఉన్నాయన్న నేపథ్యంలో అల్లు అర్జున్.. మెగా హీరోలను కలుస్తున్నారు. Also Read : మరోసారి షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్..! ఇటీవలే చిరంజీవి, నాగబాబును కలిశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతుండడటంతో.. ఈ భేటీపై ఫ్యాన్స్ ఉత్కంఠ నెలకొంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ జైలుకెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అయితే బన్నీ జైలుకు వెళ్లిన సమయంలో, జైలు నుంచి తిరిగొచ్చాక చిరంజీవి కుటుంబం అల్లు అర్జున్కు, అతని కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపింది. అందుకు కృతజ్ఞతగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ను కలుస్తున్నాడు బన్నీ. ఇందులో భాగంగా మొదట చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరు కుటుంబంతో సుమారు గంటపాటు సమయం గడిపారు. మధ్యాహ్నం అక్కడే లంచ్ కూడా చేశారు. అనంతరం నాగబాబు ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. Also Read : 'పుష్ప2' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?