/rtv/media/media_files/2025/04/07/8lq9Lt9Vw3yCA5dFs3Dq.jpg)
YCP MP Mithun Reddy
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఏపీ పోలీసులకు నోటీస్ జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించంది. మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. జస్టిస్ జెబి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ ధర్మాసనం విచారణ నిర్వహించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాల్లో భారీగా అవినీతి జరిగిందని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Also Read : జనసేనలో భగ్గుమన్న విభేదాలు.. తలలు పగిలేలా కొట్టుకున్న నేతలు
Also Read : ఈవారం ఓటీటీ, థియేటర్స్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్.. సినిమాల లిస్ట్ ఇదే?
హైకోర్టులో షాక్..
దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం తాజా ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఇదే విషయంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మిథున్ రెడ్డి. ఇంత వరకు మిథున్ రెడ్డి పేరును సీఐడీ ఎఫ్‌ఐఆర్ లో చేర్చలేదు. దీంతో ఇదే విషయాన్ని ఏపీ హైకోర్టు ప్రస్తావించింది. ఎఫ్‌ఐఆర్ లో పేరు లేకుండా ఎలా బెయిల్ ఎలా ఇవ్వగలమని వ్యాఖ్యానించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. వరుస నోటీసులతో సిట్ దూకుడు పెంచింది. సూత్రధారులు, పాత్రధారులకు ఉచ్చు బిగిస్తోంది. రాజ్ కసిరెడ్డితో పాటు విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన -ఆదాన్ డిస్లరీ, శార్వాని ఆల్కో బ్రువ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆదాన్, శార్వాని డిస్లరీలకు పెద్దమొత్తంలో మద్యం సరఫరా చేసినట్లు గుర్తించిన సిట్.. అరబిందో శ్రీనివాస్‌తో పలువురు పెద్దలు కథ నడిపించినట్లు నిర్ధారించింది.
Also Read : HCU భూ వివాదం.. హైకోర్టు సంచలన నిర్ణయం!
Also Read : ఐటీ నోటీసులకు భయపడేది లేదు! పృథ్వీరాజ్ తల్లి స్ట్రాంగ్ రిప్లై
(telugu breaking news | minister-peddireddy-ramachandra-reddy | mp-mithun-reddy | latest-telugu-news | today-news-in-telugu | chittor district | andhra-pradesh-news | andhra-pradesh-politics)
Follow Us