Prithviraj Sukumaran: ఐటీ నోటీసులకు భయపడేది లేదు! పృథ్వీరాజ్ తల్లి స్ట్రాంగ్ రిప్లై

'ఎంపురాన్' డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ కి ఐటీ నోటీసులు జారీ చేయడంపై ఆయన తల్లి మల్లికా స్పందించారు. ''నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు.. ఎలాంటి విచారణకు భయపడేది లేదని'' తెలిపారు. 2022లో విడుదలైన సినిమాలపై ఆయన సంపాదించిన ఆదాయ వివరాలను కోరుతూ ఐటీ నోటీసులు పంపింది.

New Update

Prithviraj Sukumaran:  నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కి గతవారం ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2022లో ఆయన నటించడంతో పాటు సహనిర్మాతగా వ్యవహరించిన మూడు చిత్రాలు జనగణమణ, గోల్డ్, కడువ సినిమాల నుంచి అందుకున్న ఆదాయంపై స్పష్టత కోరుతూ నోటీసులు పంపారు. అయితే తాజాగా పృథ్వీరాజ్ తల్లి మల్లికా సుకుమారన్ ఈ నోటీసులుపై స్పందించారు. "నా కొడుకు ఏ తప్పు చేయలేదు. ఎటువంటి దర్యాప్తుకు భయపడము" అని తెలిపింది. అలాగే ఈ విషయంలో తనకు,  తన కొడుకుకు మద్దతుగా నిలిచిన నటుడు మమ్ముట్టికి  కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం అనారోగ్యంతో కోలుకుంటున్న ఆయన .. తమ కోసం టైం తీసుకొని ఒక సందేశం పంపడం తన కళ్ళలో  నీళ్ళు తెప్పించిందని ఎమోషనల్ అయ్యారు 
మల్లికా సుకుమారన్. 

ఇది కూడా చూడండి: Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!

 'ఎంపురాన్' వివాదంతో 

ఇటీవలే 'ఎంపురాన్' విడుదలతో చెలరేగిన రాజకీయ వివాదమే ఐటీ నోటీసులు, ED దర్యాప్తుకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పృథ్వీరాజ్ కి సంబంధించిన 2022 టాక్స్ ఫైలింగ్స్ పరిశీలించగా.. అధికారులు కొన్ని వ్యత్యాసాలను గుర్తించారు. దీంతో వీటిపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 29 నాటికి జవాబును సమర్పించాలని కోరారు. 

అయితే 'L2: ఎంపురాన్' లో గుజరాత్ అల్లర్లను చిత్రీకరించే దృశ్యంతో సహా కొన్ని సన్నివేశాలతో ఒక వర్గం ప్రేక్షకులను  కలవరపెట్టింది. ఈ కంటెంట్ వివాదంగా మారడంతో సదరు వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆ తర్వాత ఏప్రిల్ 2న సెన్సార్ బోర్డు  ఈ చిత్రానికి 24 కట్‌లను ఆమోదించింది. పృథ్వీరాజ్ నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా  వ్యవహరించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రను పోషించారు. 

telugu-news | latest news telugu | cinema-news | prithviraj-sukumaran

Also Read: చెయ్యి విరిగినా బుద్దిరాలే.. ట్రాఫిక్‌లో IPL మ్యాచ్ చూసినందుకు చుక్కలు కనబడ్డాయి- ఏం జరిగిందో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు