TG High Court : HCU భూ వివాదం.. హైకోర్టు సంచలన నిర్ణయం!

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై స్వచ్ఛంద సంస్థలు వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.  ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న డివిజన్ బెంచ్.. కౌంటర్, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని ప్రతివాదులను ఆదేశించింది

New Update
tg-high-court-hcu

tg-high-court-hcu

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై 2025 ఏప్రిల్ 07వ తేదీన తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. స్వచ్ఛంద సంస్థలు వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.  ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న డివిజన్ బెంచ్.. కౌంటర్, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రభుత్వం నుంచి సీనియర్‌ అడ్వకేట్‌గా మేనకా గురుస్వామి తన వాదనలు వినిపించారు.  కాగా కంచ గచ్చిబౌలి భూములలో పనులు ఆపేయలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.  తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. 

Also Read :  Fake Hair Growth : ఘరానా మోసగాడు.. బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ గుండ్లు కొట్టి పరార్!

మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై  తప్పుడు, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందించారు.  ఏఐ ఉపయోగించి తప్పుడు పోస్టులు పెట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు.  2025 ఏప్రిల్ 9, 10, 11న గచ్చిబౌలి పీఎస్‌కు విచారణకు రావాలని నోటీసుల్లో వెల్లడించారు.  

Also Read: చెయ్యి విరిగినా బుద్దిరాలే.. ట్రాఫిక్‌లో IPL మ్యాచ్ చూసినందుకు చుక్కలు కనబడ్డాయి- ఏం జరిగిందో తెలుసా?

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

Also read :  MLA Raja Singh : ఒవైసీ బ్రదర్స్‌ను కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు