AP: ఏపీలో విషాదం.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలు!

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత రాష్ట్రంలో విషాదకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి.ఫెయిలయ్యామనే మనస్తాపంతో విశాఖ,నంద్యాల,నెల్లూరు జిల్లాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

New Update
suicide

suicide

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత రాష్ట్రంలో విషాదకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో ముగ్గురు విద్యార్థులు దారుణ నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. విశాఖపట్నం జిల్లా కొండపేటకు చెందిన చరణ్ తేజకు సెకండియర్ ఫిజిక్స్‌లో కేవలం 10 మార్కులే రావడంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Also Read: USA: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

AP Inter Students Suicide

ఇదిలా ఉంటే ...నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలో ఫస్ట్ ఇయర్‌లో ఫెయిలైన చిన్న మస్తాన్ అనే విద్యార్థి కూడా జీవితాన్ని అర్థారతంరంగా ముగించుకున్నాడు. నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం ప్రాంతంలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలు విద్యార్థుల మానసిక ఒత్తిడిని, సమాజంలో ఉన్న అణచివేత వాతావరణానికి అద్దం పడుతున్నాయి.

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

కర్నూలు జిల్లా ఆదోనిలో ఇద్దరు సబ్జెక్టుల్లో ఫెయిలైన ఓ బాలిక ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనలు చూస్తే, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై సమాజం, విద్యా సంస్థలు మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంత ఉందో తెలుస్తోంది.

Also Read: UPI Transactions: మరోసారి ఆగిపోయిన యూపీఐ సేవలు.. గందరగోళానికి గురవుతున్న వినియోగదారులు

Also Read: Stock Market: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

 

latest telugu news updates | latest-telugu-news | telugu-news | failure | ap-students | AP inter results 2025 | today-news-in-telugu | breaking news in telugu | andhra-pradesh-news | inter student incident | Inter Student Suicide

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు