BIG BREAKING: ఏపీలో రేపు సెలవు

రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆప్షనల్‌ హాలీడే ఇస్తూ సీఎస్‌ కే విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.రంజాన్‌ పర్వదినం అనంతరం రోజైన ఏప్రిల్‌ 1ని ఐచ్ఛిక సెలవు దినంగా పేర్కొన్నారు.

New Update
 holiday

holiday

రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆప్షనల్‌ హాలీడే ఇస్తూ సీఎస్‌ కే విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.వక్ఫ్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి నివేదిక మేరకు రంజాన్‌ పర్వదినం అనంతరం రోజైన ఏప్రిల్‌ 1ని ఐచ్ఛిక సెలవు దినంగా పేర్కొన్నారు.అటుతెలంగాణలో రేపు పబ్లిక్‌ హాలీడే ఉంది.

Also Read:Afghanistan: ఆఫ్గాన్‌కు కొత్త చట్టాలేమి అవసరం లేదంటున్న తాలిబాన్‌ చీఫ్‌!

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్...

 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. సబ్జెక్టులలో మార్పులతోపాటు కాలేజీ పనివేళలు, పరీక్షల విధానంలోనూ కీలక మార్పులు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.

Also Read: America-Iran: అటు ట్రంప్‌ హెచ్చరికలు..ఇటు క్షిపణులతో ఇరాన్‌...!

ఫస్టియర్ లో చేరే విద్యార్థులకు ఏప్రిల్ 7నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తారు. ఈ నెల 23వ తేదీ వరకు క్లాసులు నిర్వహించి, ఆ తరువాత వేసవి సెలవులు ఇస్తారు. జూన్ 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరం పున: ప్రారంభమవుతుంది. గతంలో రోజుకు ఏడు పీరియడ్లు ఉండగా ఇకనుంచి ఎనిమిది పీరియడ్లు ఉండేలా టైమ్ టేబుల్ విడుదల చేసింది ప్రభుత్వం. అంతేకాదు.. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కాలేజీలు పనిచేస్తాయి.

గతంలో ఎంపీసీ విద్యార్థులకు గణితం ఏ, బీలుగా ఉండగా ప్రస్తుత సంవత్సరం నుంచి దానిని ప్రభుత్వం ఒక్కటిగా చేసింది. బైపీసీలో బోటనీ, జువాలజీని బయాలజీగా మార్చింది. సైన్స్ విద్యార్థులకు ఆరు సబ్జెక్టుల స్థానంలో ఐదు సబ్జెక్టులు ప్రవేశపెట్టింది. వారికి ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్టుగా, మూడు సంబంధిత గ్రూపు కోర్ సబ్జెక్టులుగా ఉండగా, మరొకటి ఎలక్టివ్ సబ్జెక్టుగా తీసుకోవచ్చు. అదనపు సబ్జెక్టు కాకుండా మిగిలిన ఐదు సబ్జెక్టులు కచ్చితంగా పాస్ కావాల్సి ఉంటుంది.

ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా తీసుకుంటే ఎంబైపీసీ అవుతుంది. అదనపు సబ్జెక్టు మార్కులను సర్టిఫికెట్ లాంగ్ మెమోలో చూపించరు. దానికి అదనపు మెమో ఇస్తారు. దాని ఆధారంగా ఇంజనీరింగ్ లేదా వైద్య విద్య వైపు విద్యార్థులు వెళ్లే అవకాశం ఉంటుంది.

Also Read: UP Crime: అలహాబాద్‌ ఐఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య!

Also Read: Trump: అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..మూడోసారి కూడా నేనే..!

ap | holiday | ramdan | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు