Trump: అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..మూడోసారి కూడా నేనే..!

అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి మార్గాలున్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు.చాలా మంది ప్రజలు మూడోసారి ఎన్నిక కావాలని తనను కోరుతున్నట్లు ట్రంప్‌ చెబుతున్నారు.అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు.

New Update
Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి మార్గాలున్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు.తాను మూడోసారి బాధ్యతలు చేపట్టడాన్ని ఆయన తోసిపుచ్చలేదు.ఈ విషయంలో తాను జోక్‌ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే దీని పై ఇప్పుడే ఆలోచించడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఎన్బీసీ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ ఉగాది పోస్టర్ చూసారా..? పవర్‏ఫుల్ లుక్‏లో అదరకొట్టిన DCM

అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు.చాలా మంది ప్రజలు మూడోసారి ఎన్నిక కావాలని నన్ను కోరుతున్నారు. అయితే దానికి ఇంకా చాలా సమయముందని వారికిచెప్పా. దాని పై ఆలోచించడం తొందరపాటు అవుతుందని మీక్కూడా తెలుసు.ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించా అని ట్రంప్‌ పేర్కొన్నారు.

Also Raed: UP Crime: అలహాబాద్‌ ఐఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య!

మరోసారి అధికారం చేపడతారా..అని ప్రశ్నించగా..తనకు పని చేయడం ఇష్టమని తెలిపారు. తొలుత జేడీ వాన్స్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి..తర్వాత దానిని ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యే మీకు బదిలీ చేస్తారా..అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా..అది ఒక పద్దతని ట్రంప్‌ స్పష్టం చేశారు.దీంతో పాటు ఇతర మార్గాలు ఉన్నాయని  వివరించారు. అవేంటని ప్రశ్నించగా.. చెప్పనని సమాధానమిచ్చారు.

అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి. అది కష్టతరమైనది.రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్‌ మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి.లేదంటే మూడింట రెండొంతుల రాష్ట్రాలు అంగీకరించాలి.ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడొంతుల రాష్ట్రాలు ఆమోదించాలి.

2028 లోనూ ట్రంప్‌  అధ్యక్షుడిగా పోటీ చేసి ఎన్నికవుతారని ఆయన సన్నిహితులు స్టీవ్‌ బానన్‌ పేర్కొన్నారు. దీని కోసం మా ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి అని ఆయన వివరించారు.

Also Read:Telangana: ఎంతకు తెగించార్రా.. గుడికి వచ్చిన వివాహితపై మాటువేసి గ్యాంగ్‌రేప్‌!

Also Read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!

trump | america | president | third-time | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు