BIG BREAKING: కొత్త రూపంలో తెలంగాణ తల్లి విగ్రహం!

తెలంగాణ తల్లి విగ్రహ రూపం మారింది. రేవంత్ సర్కార్ కొత్త తెలంగాణ తల్లి విగ్రహ రూపానికి సంబంధించిన నమూనాను విడుదల చేసింది. ఈ నెల 9న సోనియా గాంధీ సచివాలయం ఎదుట విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

New Update
TG TALLI

Telangana Thalli: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చింది. కొత్త తెలంగాణ తల్లి విగ్రహ రూపానికి సంబంధించిన నమూనాను విడుదల చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి బిన్నంగా కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో కంకి, జొన్నలు, వరి.. మేడలో బంగారు ఆభరణాలు, తలకు కిరీటం, నడుముకు వడ్డాణంతో గత తెలంగాణ తల్లి విగ్రహం ఉండేది.

Also Read: ఐశ్వర్య, అభిషేక్ విడాకుల పై క్లారిటీ .. ఇన్స్టా పోస్ట్ వైరల్!

తాజాగా కాంగ్రెస్ సర్కార్ రూపొందించిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మతో పాటు కిరీటం, నడుముకు ఉన్న వడ్డాణం మాయం అయ్యాయి. తెలంగాణలో గ్రామాల్లో మహిళల కట్టుబొట్టు ప్రతిబింబించేలా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది. ఈ నెల 9న రేవంత్ సర్కార్ అధికారికంగా సచివాలయంలో కొత్త తెలంగాణ రూపాన్ని ఆవిష్కరించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ హాజరై.. కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

Also Read: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు రెండు రోజుల కస్టడీ!

కవితలా ఉందంటూ... 

తెలంగాణ తల్లి విగ్రహంపై నాటి నుంచి నేటి వరకు అనేక వివాదాస్పద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ తన కూతురు ఎమ్మెల్సీ కవిత లాగా మొహం ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారని కాంగ్రెస్, బీజేపీ పార్టీలో విమర్శలు గుప్పించాయి. తాము అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తామని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీలువ్యాఖ్యలు చేశాయి. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం నూతన తెలంగాణ తల్లి రూపంపై కార్యాచరణ సిద్ధం చేసింది. తాజాగా కొత్త రూపంలో ఉన్న తెలంగాణ తల్లి నమూనాను విడుదల చేసింది. అయితే.. దీనిపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కొత్త తెలంగాణ రూపం.. సీఎం రేవంత్ రెడ్డి సతీమణిలా ఉందని.. మరికొంత మంది కాంగ్రెస్ పార్టీ గుర్తు ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Also Read: బాలీవుడ్ లో పుష్ప మేనియా.. పుష్ప రాజ్ దెబ్బకు షారుఖ్, సల్మాన్ రికార్డ్స్ బ్రేక్

Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు