రేషన్ మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు చేసింది. కాకినాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను సిట్ విచారించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.