/rtv/media/media_files/2024/11/14/E1lymQzNFS7nGXnYKn3q.jpg)
Ex MLA Patnam Narender Reddy: కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మరోసారి షాక్ తగిలింది. లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసులో ఆయనకు మరో రెండు రోజుల పోలీస్ కస్టడీకి కొడంగల్ కోర్టు అనుమతించింది. ఆయన రేపు , ఎల్లుండి పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారించనున్నారు. కాగా న్యాయవాది ముందు విచారణ జరపాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 1785 ఖాళీలు..అర్హతలు, చివరి తేదీ వివరాలు ఇవే!
హైకోర్టులో దక్కని ఊరట..
ఇటీవల లగచర్ల అల్లర్ల ఘటనలో ఉపశమనం పొందాలని హైకోర్టును ఆశ్రయించారు పట్నం నరేందర్ రెడ్డి. లగచర్ల దాడి ఘటనలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా హైకోర్టు నరేందర్ రెడ్డికి షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కింది కోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలంటూ నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. దీనిని తిరస్కరించిన న్యాయస్థానం.. మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్ల కలకలం.. వీడియో చూశారా!
A1 నిందితుడిగా నరేందర్ రెడ్డి..
ఇక లగచర్లలో ప్రభుత్వం అధికారులపై దాడికేసులో నరేందర్ రెడ్డి A1 నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి కుట్రలో నరేందర్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద జాగింగ్ కు వెళ్లిన పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు బలవంతంగా తరలించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్
Also Read: నిఖేశ్‌కుమార్ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!