/rtv/media/media_files/2024/12/29/8IaWfqeggCzXB1QJpyhs.jpg)
CM Chandrababu
నేటి నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు రానున్నట్లు ప్రభుత్వం ముందే ప్రకటించింది. గ్రోత్ సెంటర్ల ఆధారంగా 0-20 శాతం వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇదివరకే తెలిపారు. ఈ క్రమంలో గత రెండు నుంచి పెద్ద ఎత్తున కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ధరలు పెరగకముందే చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఒక్కసారి ఎక్కువ మంది కావడంతో కొన్ని చోట్లు సర్వర్లు పనిచేయలేదు. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యం కావడంతో.. రాత్రి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్లు అవుతూనే ఉన్నాయి.
ఇది కూడా చూడండి: Karthikeya 3: కార్తికేయ-3 పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!
సర్టిఫికేట్లు అన్ని కూడా..
ఇదిలా ఉండగా ఇటీవల ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌ను కూడా ప్రారంభించింది. పౌరసేవలు అందించేందుకు దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చింది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ ఈ వాట్సాప్ సేవలను ప్రారంభించారు. ఇకపై అన్ని ప్రభుత్వ ధృవపత్రాలన్నీ కూడా వాట్సాప్ ద్వారా ప్రజలకు అందేందుకు దీన్ని తీసుకొచ్చారు. దీని కోసం అధికారిక వాట్సాప్ నంబర్ 919552300009 ను కూడా మంత్రి లోకేష్ ప్రకటించారు.
ఇది కూడా చూడండి: Cricket: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం
ఈ వాట్సాప్ గవర్నెన్స్ కింద మొదటి విడతలో 161 సేవలను అందించనున్నారు. ప్రజలు సర్టిఫికేట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అన్ని అందించేందుకు 2024 అక్టోబరు 22న ప్రభుత్వం మెటాతో ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చింది.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!