/rtv/media/media_files/2025/02/10/KyKv74kBhyGaQSShyj3g.jpg)
AP Deputy CM Pawan Kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడులో పవన్ టూర్ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 4 రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో వివిధ ఆలయాలను ఆయన సందర్శించనున్నారు. అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుసరామస్వామి, అగస్థ్యజీవసమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను పవన్ సందర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. పవన్ కల్యాణ్ ఇటీవల సనాతన ధర్మం కోసం పలు కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత వారాహీ దీక్షను చేపట్టిన పవన్, తిరుపతి లడ్డూ కల్తీ సమయంలో ప్రాయాశ్చిత దీక్షను చేపట్టారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
Also Read : ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పర్యటన
— RTV (@RTVnewsnetwork) February 10, 2025
ఈనెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పర్యటన
4 రోజులు పాటు వివిధ దేవాలయాలను సందర్శించనున్న పవన్ కళ్యాణ్
ఈనెల 12వ తేది నుంచి 14వ తేది వరకు పవన్ ఆలయాల సందర్శన
అనంతపద్మనాభ స్వామి, మధుర… pic.twitter.com/8Pr1KrWGuv
Also Read : ముగిసిన ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్.. ఫైనల్ లెక్కలివే!
దక్షణాదిలో బీజేపీకి పవన్ హెల్ప్..?
ఇందులో భాగంగానే పవన్ వివిధ ఆలయాలను సందర్శించడానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిన బలం పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ (BJP) పవన్ కల్యాణ్ ను అందుకు ఆయుధంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంత్యంత పాపులారిటీ, ఫాలోయింగ్ ఉన్న పవన్ దక్షిణాదిన తమ నాయకుడిగా ఉంటే.. కలిసి వస్తుందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటందన్న విశ్లేషణలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే పవన్ దక్షిణాది టూర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పర్యటన సమయంలో పవన్ ఎవరెవరిని కలుస్తారు? ఏ అంశాలపై మాట్లాడుతారు? అన్న అంశంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Also Read : ఇది చారిత్రాత్మకమైన తీర్పు.. ఢిల్లీ రిజల్ట్స్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!
Also Read : ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!