/rtv/media/media_files/2025/01/31/4fVswU2ZRjyCQzsIIw8k.jpg)
supreme court Photograph: (supreme court)
బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రీజనబుల్ టైం అంటే ఏంటని ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. ఇప్పటికే పది నెలలు అయ్యింది ఇది రీజనబుల్ టైం కాదా? అని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం మూడు నెలలు రీజనబుల్ టైం అని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
పిటిషనర్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అనంతరం కేసు విచారణను ఈ నెల 18కి న్యాయస్థానం వాయిదా వేసింది. అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ నుంచి సమాచారం కోసం సమయం కావాలని కోరారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ప్రధాన పార్టీల్లో టెన్షన్..
సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుగుతుండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల్లో తీర్పు ఎలా వస్తుందనే అంశంపై టెన్షన్ నెలకొంది. తేడా వస్తే తెలంగాణలో 10 శాసనసభ స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫిరాయింపుల వ్యవహారంపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే స్పందించారు. ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. కోర్టు తీర్పు ఎలా వచ్చినా శిరసావహిస్తానన్నారు.