/rtv/media/media_files/2025/05/18/4qhdyNO60zTHF6uNZEml.jpg)
ap crime news
AP Crime: ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాల్లో రెండు విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన తీవ్రంగా కలచివేసింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలానికి చెందిన దేవరాజపురంలో మూడు మురికినీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, విజయనగరం జిల్లాలోని ద్వారపూడిలో కారులో చిక్కుకుని నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ రెండు ఘటనలు అక్కడి వాసులతోపాటు రాష్ట్ర ప్రజల హృదయాలను కలిసి వేసింది.
తిరిగి రాని లోకానికి..
చిత్తూరు జిల్లా దేవరాజపురంలో ఒక ఇంటి నిర్మాణం కోసం తవ్విన గుంత వర్షాల కారణంగా నీటితో నిండింది. ఆ ప్రాంతంలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు శాలిని (5), అశ్విన్ (6), గౌతమి (8) ఆ గుంతలో పడి గల్లంతయ్యారు. చిన్నారుల మృతదేహాలు వెలికి తీసిన తర్వాత అక్కడి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి మృతి పట్ల గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఇది కూడా చదవండి: ఇంట్లోనే నాణ్యమైన నెయ్యి.. ఈ చిట్కాతో తయారీ సులభం
విజయనగరం జిల్లా ద్వారపూడిలో ఆదివారం ఉదయం బయటకు ఆడుకోవడానికి వెళ్లిన నలుగురు చిన్నారులు ఇంటికి తిరిగి రాలేదు. బంధువులు వెతికినా వారి ఆచూకీ లేకపోవడంతో ఆందోళన చెందారు. అనంతరం గ్రామంలోని మహిళా మండలి కార్యాలయం సమీపంలో నిలిపి ఉంచిన ఓ కారులో నలుగురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వారు సరదాగా ఆ కారు లోపలికి వెళ్లి ఆడుకుంటుండగా, డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులు చారుమతి (8), ఉదయ్ (8), మనస్వి, చరిష్మా (6)గా పోలీసులు గుర్తించారు. వీరిలో చారుమతి, చరిష్మా అక్కాచెల్లెళ్లు. ఈ రెండు ఘటనలు బాధిత కుటుంబాలతోపాటు రాష్ట్ర ప్రజలను తిరని శోకాన్ని మిగిల్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: అకాల వర్షాలతో వ్యాధులు వచ్చే ప్రమాదం.. ఈ టిప్స్ అప్రమత్తంగా ఉండండి
( AP Crime | ap crime updates | ap-crime-news | ap-crime-report | ap crime latest updates | latest-news | telugu-news )