TTD Income : చంద్రబాబు బర్త్ డే...టీటీడీకి విరాళాల వెల్లువ..ఎంతంటే ?
చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. పుట్టినరోజును పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు భాష్యం విద్యాసంస్థలు రూ.44 లక్షలు విరాళంగా అందించాయి. ఈ విరాళంతో ఆదివారం అన్న ప్రసాద వితరణ జరుగుతోంది.