Chennai: బాలికపై ఆటో డ్రైవర్ తో పాటు ఆరుగురు టెక్కీలు అత్యాచారం తమిళనాడులో ముంబైకి చెందిన ఓ బాలికపై ఆటో డ్రైవర్ సహా ఆరుగురు టెక్కీలు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Bhavana 07 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Chennai: దేశంలో రోజురోజుకు మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ముంబైకి చెందిన ఓ బాలికపై ఆటో డ్రైవర్ సహా ఆరుగురు టెక్కీలు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆలస్యంగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన 16 ఏళ్ల బాలిక, తన కుటుంబ సభ్యులు దీపావళి పండుగకు పుదుచ్చేరిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ బాలిక.. తల్లితో గొడవపడి అక్టోబర్ 30న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. Also Read: Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి పర్యాటక ప్రాంతాలు చూపించాలంటూ ఓ ఆటో డ్రైవర్‌ను కోరింది. డ్రైవర్.. నేరుగా ఇంటికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడితో పాటు, అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను పుదుచ్చేరిలోని బీచ్ రోడ్‌లో వదిలేసి వెళ్లాడు. అక్కడ బలహీన స్థితిలో కనిపించిన బాలికను చెన్నైకి చెందిన ఆరుగురు టెక్కీలు గమనించి ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశారు. చెన్నైలో స్నేహితుడి ఇంటికి వెళ్లాలని ఆమె అడగగానే.. తాము తీసుకెళ్తామంటూ నమ్మించి చెన్నైకి తీసుకొచ్చారు. Also Read: Maharashtra : నేను గెలిస్తే బ్రహ్మచారులందరికీ పెళ్లి చేస్తా..! అనంతరం ఓ గదికి తీసుకెళ్లి బాలికపై ఒకరి తర్వాత ఒకరు. వరుసగా ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను తిరిగి క్యాబ్ బుక్ చేసి పుదుచ్చేరికి పంపేశారు. Also Read: WPL: మహిళ ప్రీమియర్ లీగ్ 2025.. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే! అయితే తమ కుమార్తె తప్పిపోయిందంటూ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేస్తున్న పోలీసులుకు.. బీచ్‌లో బాలిక తారసపడ్డాది. బలహీన స్థితిలో ఉన్న ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. బాలిక వ్యక్తిత్వ లోపానికి గురైనట్లుగా గుర్తించారు. బాలిక ద్వారా వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. తనపై గ్యాంగ్‌రేప్ జరిగినట్లుగా చెప్పింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విల్లుపురం జిల్లా కోటకుప్పానికి చెందిన డ్రైవర్ కాజా మొహిదీన్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. Also Read: Ponguleti: అప్పుడే ఆటమ్ బాంబ్ పేలబోతోంది.. పొంగులేటి మరో సంచలనం! అనంతరం చెన్నైకి చెందిన ఆరుగురు టెక్కీలలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని, ఒడిశాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడినవారందరినీ పట్టుకునే వరకు అరెస్టయిన వారి పేర్లను బయటపెట్టకూడదని పోలీసులు నిర్ణయించారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి