/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
టీడీపీ సీనియర్ నాయకులు(tdp-leader), ఏపీ ఆగ్రోస్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు(Malepati Subbanaidu) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ తో పది రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2025 ఆక్టోబర్ 20వ తేదీ సోమవారం తెల్లవారుజూమున తుదిశ్వాస విడిచారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. సుబ్బానాయుడు మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటుగా టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు. కాగా మాలేపాటి కావలి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి, గిరిజనుల సమస్యలపై పోరాడటానికి కృషి చేశారు. కూటమి ప్రభుత్వం 2024లో ఆయనను ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APAGROS) ఛైర్మన్ గా నియమించింది.
Also Read : దీపావళి విశిష్టత ఏంటి? ఈ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే..!
TDP Leader Malepati Subbanaidu Passed Away
టీడీపీ సీనియర్ నాయకులు, ఏపీ ఆగ్రోస్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు గారి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. కొంచెం ఆలస్యమైనా కోలుకుని ఆస్పత్రి నుంచి క్షేమంగా బయటకు వస్తారనుకున్నా..ఇలాంటి విషాదకరమైన వార్త వినాల్సివస్తుందనుకోలేదు. ఎంతో ఆత్మీయంగా ఉండే కుటుంబసభ్యుడిని కోల్పోయా.… pic.twitter.com/z3Cfx7m4mK
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) October 20, 2025
ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు గారి అకస్మాత్తు మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.
— Vemireddy Prabhakar Reddy (@vpr_official_) October 20, 2025
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఓం శాంతి
Also Read : ఏపీలో భారీ బాంబు పేలుడు.. స్పాట్ లో ఆరుగురికి
Follow Us