అమరావతి డెవలప్మెంట్ పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు|Minister Narayana on Amaravati development| RTV
నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్ళీ బుడ మేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని చెప్పారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. దాని మీద వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని..విజయవాడ పూర్తిగా సేఫ్గా ఉందని అన్నారు.
అనుమతి లేకుండా చేసే లే అవుట్ లకు భారీగా పెనాల్టీ విధించే ఆలోచన చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. సెంట్రల్ డివైడర్ లలో ఎలాంటి వాణిజ్య ప్రకటనల బోర్డులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులపై మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
పల్నాడు జిల్లాలో డయేరియా ప్రభావిత ప్రాంతంలో అధికారులతో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. పారిశుధ్య నిర్వహణ, తాగు నీటి బోర్లను పరిశీలించారు. డయేరియా బాధితులను పరామర్శించారు. లెనిన్ నగర్, మారుతి నగర్లో పూర్తిగా డ్రైనేజీ క్లీన్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీని అమలుపరుస్తామన్నారు మంత్రి నారాయణ. నిరుపేద మెరిట్ విద్యార్థులకు ఉచితంగా మెరుగైన విద్యాబోధన అందిస్తానన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు పలుచోట్ల లేవుట్లలో అక్రమాలు జరిగాయని.. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.