/rtv/media/media_files/2025/10/01/ap-social-media-2025-10-01-20-24-19.jpg)
AP Govt Forms Committee On Social Media Regulations
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(andhra-pradesh-government) కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా నియంత్రణకై లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది.సభ్యులుగా మంత్రులు అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి లు ఈ కమిటీలో ఉన్నారు. సోషల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణపై ఈ కమిటీ దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్‌పై నిఘా పెట్టనున్నారు. తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్, నేషనల్ సెక్యూరిటీ ముప్పులపై చర్యలకు సిఫారసులు చేయనున్నారు.
మంత్రుల కమిటీ పౌర హక్కుల పరిరక్షణకు సూచనలు ఇవ్వనుంది. అవసరమైతే నోడల్ ఏజెన్సీలు(Nodal Agency) లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలు ఏర్పాటు సిఫారసు చేసే అధికారం కూడా వీరి కల్పించారు. మంత్రుల కమిటీ సిఫారసులను వీలైనంత త్వరలో ప్రభుత్వానికి సమర్పించనుంది.
Also Read : శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఇక తిరుపతి వెల్లడం మరింత ఈజీ!
Also Read : ప్రియుడితో భర్తను చంపించి.. రోడ్డుప్రమాదంగా చిత్రీకరించింది.. చివరికి ఏమయిందంటే?