మా వద్ద డబ్బులు తీసుకుని.. | Women's Reaction to Free Gas Cylinders | RTV
ఏపీలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఎన్నికల హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నారు.కాగా గత నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ మొదలయ్యాయి.
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి నేటి నుంచి బుకింగ్స్ మొదలుకానున్నాయి. వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా ఈ పథకానికి అర్హులు. ఉచిత సిలిండర్‌ను ఈ రోజు బుక్ చేసుకుంటే దీపావళికి డెలివరీ చేస్తారు.
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అక్టోబర్ 29 నుంచి బుకింగ్ మొదలుకానుంది. ఈ గ్యాస్ బుకింగ్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారుల తెల్ల రేషన్‌కార్డుల సమాచారం ఉంటే కానీ బుకింగ్ వీలుకాని పరిస్థితి ఏర్పడింది. దీనిపై అధికారుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు సిలిండర్ల పథకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీపావళి నుంచే పథకం అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి ఏడాదికి ఎంత ఖర్చు? ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారనే వివరాలపై పౌరసరఫరాల శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది.