/rtv/media/media_files/2025/07/28/free-bus-2025-07-28-20-10-57.jpg)
ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు త్వరలో రూ.10వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. ఉచిత బస్సు ప్రయాణం ముందుగా జిల్లాలకే వర్తింపజేయాలని భావించినప్పటికీరాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటించారు. మంత్రి నారా లోకేష్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక త్వరలోనే అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో రైతులకు రూ.20వేల ఆర్థికసాయం అందజేస్తామని మంత్రి రవీంద్ర వెల్లడించారు.
పలాస నియోజకవర్గంలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర గారు పాల్గొన్నారు.#KolluRavindra#Machilipatnam#AndhraPradeshpic.twitter.com/708J8jZaGg
— Kollu Ravindra (@KolluROfficial) July 28, 2025
ఏపీకి దిగ్గజ కంపెనీలు
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సందర్భంగా ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు ఏపీకి రాబోతున్నట్లుగా మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. వైసీపీ పాలనలో వెనక్కి వెళ్లిపోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంను ఫైనాన్షియల్ హబ్‌గా చేయడానికి కార్యాచరణ చేస్తున్నాం అని, 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఏపీని అభివృద్ధి వైపు నడిపించేందుకు కూటమి ప్రభుత్వం పయణిస్తుంటే వైసీపీ నాయకులు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కులమతాలు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.