Accident : సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, బస్సు ఢీకొని నలుగురు మృతి!
సూర్యాపేట జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతె సమీపంలో ఆటో, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రామసముద్రానికి చెందిన వ్యవసాయ కూలీలు నలుగురు అక్కడిక్కడే చనిపోయారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.