/rtv/media/media_files/2024/12/20/ULDKNXjHgILWuc5EjMGd.jpg)
యూట్యూబ్ లేదా మరేదైనా సోషల్ మీడియా...అంతా వ్యాస్, లైక్స్ మీదనే నడుస్తాయి. అవి సాధించడానికి యూజర్లు అడ్డమైన దారులూ తొక్కుతారు. య్యూట్యూబ్ గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. బయట వీడియోకు ఒక టైటిల్ ఉంటుంది. లోపలకు వెళ్ళి చూతే అసలు సంబంధమ లేని మ్యాటర్ ఉంటుంది. ఇలా థంబ్ నెయిల్స్ చూసి వీడియో మొత్తం చూసి మోసపోతున్నవారు ప్రపంచంలో చాలా మందే ఉంటారు. ఉదాహరణకు ఫలానా సినిమా అంటూ థంబ్‌నైల్‌లో చూపించి ఏదో సినిమాను లోపల పెడుతుంటారు. ఇక సెలబ్రిటీలు, రాజకీయ నేతల గురించి ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్ క్రియేట్ చేస్తుంటారు. తీరా లోపలికి వెళ్తే.. అలాంటిదేమీ ఉండదు. ఇలా తప్పుదోవ పట్టించే చర్యలతో యూజర్లు విసుగెత్తి పోతున్నారు. వీటి కారణంగా సమయం వృథా అవ్వడమే కాకుండా ప్యూట్యూబ్ అంటేనే విసుగొచ్చేలా తయారయింది. దీని వలన యూట్యూబ్ మీద విశాసం తగ్గిపోయింది. అందుకే కొత్త చర్యలకు సిద్ధమైంది.
కొత్త రూల్స్ పాటించలేదో...అంతే...
తప్పుదోవ పట్టించే థంబ్ నెయిల్స్, టైటిల్స్‌కు అడ్డుకట్ట వేయాలని యూట్యూబ ప్లాట్ ఫామ్ నిర్ణయించుకుంది. లాంటి పనులు చేస్తే ఇక మీదట కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అందులో భాగంగా త్వరలోనే కొత్త నిబంధనల్ని తేనున్నట్లు చెప్పింది. వీటిని పాటించేందుకు క్రియేటర్లకు తగిన సమయం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. నిబంధనలు పాటించక పోతే వార్నింగ్‌గా ఒదట ఈఇయోలను తొలగించనుంది. ఆ తరువాత కూడా అదే విధంగా వీడియోలు అప్‌లోడ్ చేస్తే..సదరు ఛానెల్ లేదా యూజర్ అకౌంట్ మీద స్ట్రైక్ వేయనుంది. ఇలాంటి తప్పుదోవ పట్టించే టైటిల్స్ ఎక్కువగా ఇండియాలోనే ఉందని...అందుకని ఇక్కడే ఈ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని చెబుతోంది యూట్యూబ్ యాజమాన్యం.
Also Read: ఒక్క సెషన్‌లో 9 లక్షల కోట్లు..వరుసగా ఐదవరోజూ నష్టాల్లో మార్కెట్