సాధారణంగా ఒక రోజులో 12 గంటల వెలుగు, 12 గంటలు చీకటి ఉంటుంది. కానీ ఇలా అన్ని వేళలు సమానంగా ఉండవు. సూర్యుడు భూమధ్యరేఖకు సమాంతరంగా ఉన్నప్పుడే ఇలా జరుగుతుంటాయి. అయితే సూర్యుడు చుట్టూ భూమి ధీర్ఘవృత్తాకారంలో తిరగడంతో వాటి మధ్య దూరాల్లో ఈ తేడా కనిపిస్తుంది. భూమి ఉత్తర ద్రువం సూర్యుడికి దూరంగా ఉన్నపుడు పగలు తక్కువ.. రాత్రి ఎక్కువగా ఉంటుంది. అదే ఇప్పుడు జరగబోతోంది. రేపు పగలు తక్కువ, రాత్రి ఎక్కువ సమయం ఉండనుంది. ఇది కూడా చూడండి: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు డిసెంబర్ 21న అద్భుతం డిసెంబర్ 21 న కేవలం 8గంటలు పగలు, 16 గంటలు రాత్రి సమయం ఉంటుంది. దీన్నే శీతాకాలపు అయనాంతం (వింటర్ సోల్‌స్టైస్) అంటారు. అలాగే జూన్‌లో కూడా ఇది ఏర్పడుతుంది. జూన్ 21న ఏర్పడే అయనాంతాన్ని సమ్మర్ సోలిస్టైస్ అంటారు. ఆ రోజు పగలు ఎక్కువగా.. రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. జూన్ 21న 16 గంటల పగలు, 8 గంటల రాత్రి ఉంటుంది. ఇది కూడా చూడండి: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే! ఇక డిసెంబర్ 21 అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం అత్యంత ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజు భూమి దాని ధ్రువం దగ్గర 23.4 డిగ్రీల కర్వ్డ్ (వంపు)లో ఉంటుంది. అయితే ఇది సహజ మార్పుగానే భావిస్తారు. ఈ మార్పు కారణంగా ఈ ఏడాది డిసెంబర్ 21న అత్యంత తక్కువ పగలు, ఎక్కువ రాత్రి ఏర్పడుతుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతుంది. కాబట్టి దీనిని శీతాకాలపు అయనాంతంగా పిలుస్తారు. కాగా శీతాకాల అయనాంతం వచ్చే తేదీ ప్రతీ సంవత్సరం మారుతూ ఉంటుంది. ఇది డిసెంబర్ 20 నుంచి 23 తేదీల మధ్యలో వస్తుంది. ఇక డిసెంబర్ 21 సూర్యునికి భూమికి మధ్య గరిష్ట దూరం ఉండటంతో సూర్యకిరణాలు భూమిని తాకేందుకు చాలా సమయం పడుతుంది. ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు వివిధ దేశాల్లో ఉత్సవాలు ఇక్కడ మరో విశేషం ఏంటేంటే.. వివిధ దేశాల్లో శీతాకాలపు అయనాంతం రోజున ఉత్సవాలు సైతం జరుపుకుంటారు. దీనిపై వివిధ దేశాల్లో రకరకాల నమ్మకాలు ఉన్నాయి. అయనాంతం వచ్చినపుడు నార్త్ ఇండియాలో శ్రీకృష్ణునికి నైవేథ్యం సమర్పిస్తారు. అలాగే గీతా పారాయణం చేస్తారు. ఇంకా రాజస్థాన్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో పుష్యమాస పండుగను జరుపుకుంటారు. సూర్యుడు భూమికి సమానంగా ఉండే రోజులు ఇది కూడా చూడండి: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! మార్చి 21న, సెప్టెంబర్ 23న రాత్రి, పగలు సమానంగా ఉంటాయి. సెప్టెంబర్ 23 నుంచి డిసెంబర్ 21 మధ్య సూర్యుడు, భూమికి మధ్య దూరం పెరిగి క్రమంగా పగలు సమయం తగ్గుతుంది. అదే సమయంలో రాత్రి సమయం పెరుగుతుంది. అలాగే డిసెంబర్ 21 నుంచి మార్చి 21 వరకు భూమి, సూర్యుడి మధ్య దూరం తగ్గుతూ వచ్చి పగలు పెరుగుతూ ఉంటుంది. రాత్రి తగ్గుతూ ఉంటుంది. మార్చి 21న రాత్రి, పగలు సమానంగా ఉంటాయి. దీన్ని ఈక్వీన్ ఆఫ్ అంటారు. మరి రాబోయే డిసెంబర్ 21 అంటే రేపు అద్భుతాన్ని గమనించండి.