Aeroplane Sized Asteroid : భూమి వైపు భారీ గ్రహశకలాలు వస్తున్నట్లు నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) హెచ్చరించింది. విమానం పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం, "2024 XN1", డిసెంబర్ 24న, క్రిస్మస్ ముందు రోజున భూమికి అత్యంత సమీపం నుండి వెళ్లనుంది. దీనితో పాటు మరో నాలుగు ఆస్టరాయిడ్లు కూడా భూమికి దగ్గరగా వస్తున్నాయి. Also Read: కేటీఆర్ కు మరో బిగ్ షాక్.. రంగంలోకి స్పెషల్ టీమ్! ఇందులో 2024 XN1 ఆస్టరాయిడ్ పొడవు 120 అడుగులు, నాసా చెప్పిన ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన అత్యంత పెద్ద గ్రహశకలంగా ఇదే. ఈ గ్రహశకలం భూమి నుండి 72.17 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి గంటకు 24 వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లిపోతుంది. Also Read: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రేవంత్ ను కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలు! భూమిపై ఏ ప్రాంతంలో పడతాయో..! ఈ పెద్ద గ్రహశకలంతో పాటు, మరికొన్ని చిన్న గ్రహశకలాలు కూడా భూమి సమీపంలోకి వస్తున్నాయి. వాటిలో 44 అడుగుల పొడవున్న "2024 XY4" డిసెంబర్ 20న 30 లక్షల మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది. మరో రెండు ఆస్టరాయిడ్లు, "2024 XQ4" (50 అడుగులు), "2024×20" (60 అడుగులు) డిసెంబర్ 21న భూమికి 6.56 లక్షల మైళ్ల దూరం నుండి వెళ్లిపోతాయి. Also Read: ఖమ్మంలో షాకింగ్ ఘటన.. పెళ్లి పేరుతో రూ.40 లక్షలు కొట్టేసిన కిలాడీ! ఈ గ్రహశకలాలు భూమిపై ఎక్కడ పడతాయో, వాటి నుండి ఎలాంటి నష్టం సంభవిస్తుందో అన్న సందేహాలు ప్రజల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. Also Read: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు