TDP-YCP: టీడీపీ వైసీపీ వర్గాల మధ్య రగడ..!
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో ఇరు వర్గాల మధ్య రగడ నెలకొంది. టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ పై మరొక వర్గం దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో ఇరు వర్గాల మధ్య రగడ నెలకొంది. టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ పై మరొక వర్గం దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
అనంతపురం జిల్లాలోని సూగురులో ఈరోజు నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి.. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త. త్వరలో రెండు రాష్ట్ర విద్యార్థులకు ఈ తేదీల నుంచి వేసవి సెలవులు ప్రకటించే అవకాశముంది. అ తేదీలు ఏంటో తెలుసుకోండి!
అనంతపురం జిల్లా ఆవుల తిప్పాయపల్లిలో నాలుగేళ్ల చిన్నారికి ప్రమాదం తప్పింది. వీధి కుక్కలు చిన్నారి అవంతికను వెంబడించడంతో భయంతో పరిగెత్తుతూ రెండు గోడల మధ్య చిక్కుకుంది. తల్లిదండ్రుల సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూటిమ్.. సురక్షితంగా చిన్నారిని బయటికి తీశారు.
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగినది. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొన్నది. ఎగిరి కారుపై పడిన యువకుడు మృతిదేహాన్ని 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. కొంతమంది వాహనదారులు కారుపై మృతదేహం ఉన్నట్లు గుర్తించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ను ఓడించి బుద్ధి చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఓటు అనే ఆయుధాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. శింగనమలలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఉరవకొండ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఇంటి పట్టాలను పంపిణీ చేశాడని ఫైర్ అయ్యారు. ఈ విషయంపై ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
టీడీపీ నేత, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే.. సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ అభిమానిపై బాలయ్య ఆగ్రహంతో చెయ్యి ఎత్తారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కుర్లపల్లి గ్రామంలో రామాలయ విగ్రహ ప్రతిష్టలో అపశృతి చోటుచేసుకుంది. విగ్రహ ప్రతిష్ట వేడుకలో భాగంగా ప్రజలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ ఆహారం తిన్న 200 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. బాధితులు చికిత్స పొందుతున్నారు.