anakapalli crime news
AP Crime: అనకాపల్లిలోని లోకావారి వీధిలో కిడ్నాప్ ఘటన సంచలనంగా మారింది. నాలుగేళ్ల చిన్నారి లోహిత తన ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తు తెలియని మహిళ వచ్చి ఆమెను ఎత్తుకెళ్లిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన మే 16 వ తేదీన మధ్యాహ్నం సమయంలో జరిగింది. చిన్నారి అదృశ్యం కావడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
/rtv/media/media_files/2025/05/17/2iLPG40y2nzCwFAuH7qd.jpg)
సీసీ కెమెరాల ఆధారంగా..
సదరు మహిళ చిన్నారితో కలిసి పెరుగు బజార్ జంక్షన్‌కు చేరుకుని అక్కడి నుంచి బస్సులో ఎక్కిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బస్సు ఎక్కే సమయంలో ఆమె తలపై ఓ చెక్క బ్యాగు, చేతిలో చిన్నారి ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆధారాలను పరిశీలించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
/rtv/media/media_files/2025/05/17/b8omxGYDhEUDZUVRZIyH.jpg)
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానిత మహిళను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ మహిళ ఏ బస్సు ఎక్కింది? ఎటు వైపు వెళ్లింది? ఎందుకు కిడ్నాప్ చేసింది? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/05/17/bq6rkDkVDx3RgXMKU9vr.jpg)
ఇది కూడా చదవండి: పిల్లల ఆకలిని పెంపొందించే ప్రభావవంతమైన చిట్కాలు
( AP Crime | ap crime updates | ap-crime-news | ap-crime-report | ap crime latest updates | latest-news | telugu-news )
ఇది కూడా చదవండి: ముఖం ఫిట్‌గా, యవ్వనంగా కావలా..? అయితే ఈ మూడు వ్యాయామాలు ట్రై చేయండి
Follow Us