Anant-Radhika Pre Wedding: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. గుజరాత్లోని జామ్నగర్లో ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ గ్రాండ్ ఈవెంట్ కు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన అతిథులతో పాటు భారత క్రికెట్ స్టార్లు కూడా జామ్నగర్ చేరుకున్నారు. అతిథులతో జామ్ నగర్ లో సందడి నెలకొంది. మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్న ఈ వేడుకల్లో ప్రముఖలు సందడి చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Anant-Radhika Pre Wedding: అంబానీ కుటుంబ పెళ్లి వేడుకలో ..టీమిండియా స్టార్ ప్లేయర్ల సందడి.!
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ ఇంట్లో పెళ్లి వేడుక షురూ అయ్యింది. జామ్ నగర్ లో జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు భారత క్రికెటర్లు ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, హార్దిక్ పాండ్యాతోపాటు పలువురు ఇతర క్రికెటర్లు ఫ్యామిలీతో కలిసి తళుక్కున మెరిశారు.
Translate this News: