MOVIES:దసరా బరిలో ఐదు సినిమాలు...హిట్ కొట్టేది ఏదో?

దసరా బరిలో ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నాలుగు చిత్రాలు పాన్ ఇండియా బ్రాండ్ తో వస్తూ ఉండగా ఒక్క బాలయ్య మూవీ మాత్రమే తెలుగులో రిలీజ్ అవుతోంది. లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్లో వస్తున్న లియో, రవితేజ ట్రైగర్ నాగేశ్వర్రావులు ఇందులో ఉన్నాయి.

MOVIES:దసరా బరిలో ఐదు సినిమాలు...హిట్ కొట్టేది ఏదో?
New Update

పండగలకు రిలీజ్ అయ్యే సినిమాల మీద మంచి క్రేజ్ ఉంటుంది. అందులోనూ దసరా, సంక్రాంతి పండగల కోసం తమ సినిమాలను ప్రత్యేకంగా రిజర్వ్ చేసుకుంటారు మూవీ మేకర్స్. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో దసరా వస్తోంది. దీంతో భారత్‌లో పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్‌లుపెట్టుకున్నాయి. ఈ ఏడాది ఈ రేసులో 5 సినిమాలు ఉన్నాయి.అందులో నాలుగు పాన్ ఇండియా రేంజ్ సినిమాలు కాగా, ఒక్కటి మాత్రం తెలుగులో విడుదల అవుతోంది. కోలీవుడ్ నుంచి ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన లియో మూవీ థియేటర్స్ లోకి అక్టోబర్ 19న వస్తోంది. అదే రోజు భగవంత్ కేసరి తెలుగులో రిలీజ్ అవుతోంది.అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. కన్నడం నుంచి సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ మూవీ అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ నుంచి టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన గణపత్ మూవీ అక్టోబర్ 20న థియేటర్స్ లోకి వస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఈ చిత్రం రిలీజ్ అవ్వనుంది.

ఈ సినిమాల రన్ టైం ఇప్పటికే లాక్ అయ్యింది. టైగర్ నాగేశ్వరరావు మూవీ రన్ టైం రెండు గంటల రెండు నిమిషాల నిడివితో ఉంది. దళపతి లియో మూవీ మూవీ రెండు గంటల 44 నిమిషాల నిడివి ఉండగా...బాలయ్య బాబు భగవంత్ కేసరి మూవీ రెండు గంటల 35 నిమిషాలు రన్ టైమ్ ఉందని చెబుతున్నారు. శివరాజ్ కుమార్ ఘోస్ట్ మూవీ రెండు గంటల ఏడు నిమిషాలు, టైగర్ ష్రాఫ్ గణపత్ మూవీ 2 గంటల 10 నిమిషాలు నిడివి ఉందని తెలుస్తోంది.

ఈ చిత్రాలు దేనికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం. లియో, ఘోస్ట్ మూవీస్ మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో వస్తున్నాయి. భగవంత్ కేసరి, గణపత్ సినిమాలు కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా థియేటర్స్ లోకి రాబోతున్నాయి. టైగర్ నాగేశ్వరరావు పీరియాడిక్ బయోపిక్ స్టోరీగా సందడి చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమాలు అన్నింటిపైనా పాజిటివ్ బజ్ ఉంది. లియో పాటలు అట్టర్ ఫ్లాప్ అయినా మూవీ మీద క్రేజ్ మాత్రం నిలిచే ఉంది. ఇంక ఘవంత్ కేసరి మీద అయితే ఫుల్ గా బజ్ ఉంది. ఇపప్పటివరకూ బాలయ్యబాబు చెయ్యని పాత్ర చెయ్యడం ఒకటి అయితే...ఒక అమ్మాయికి తండ్రిగా నటించడం కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు. అలాగఏ టైగర్ నాగేశ్వర్రావు మీద కూడా తెలుగు ప్రేక్షకులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అ సినిమాతో రవితేజ్ మరోసారి మాస్ మహారాజా అనిపించుకుంటాడని అతని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

అన్ని సినిమాల్లో కంటే ఎక్కువ నిడివి ఉన్న చిత్రం లియో. అయితే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటూ స్పీడ్ స్క్రీన్ ప్లే కారణంగా లోకేష్ కనగరాజ్ సినిమాలు చాలా వేగంగా పూర్తయిపోయినట్లు ఉంటాయి. లోకేష్ కనగరాజ్ స్టైల్ వల్లనే అతని సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి కూడా.

Also Read:స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా లోకేష్ కు ఊరట

ప్రపంచం అంతా పోరాటం చేస్తాం-హమాస్ కమాండర్ ప్రకటన

#telugu #india #hindi #movies #tamil #release #dasara
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe