స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నారా లోకేష్ హైకోర్టులో పటిషన్ దాఖలు చేశారు. దీని మీద ఈ రోజు విచారించిన కోర్టు కేసును క్లోజ్ చేస్తున్నామంటూ తీర్పును ఇచ్చింది. ఇంతకు ముందు హైకోర్టు జరిపిన విచారణలో గురువారం వరకు లోకేష్ ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ కోర్టులో ఇరుపక్షాలు తమ వాదనలను వినిపించాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ ను ముద్దాయిగా చూపలేదని సీఐడీ కోర్టుకు తెలిపింది. ముద్దాయిగా చూపని కారణంగా అతనిని అరెస్ట్ చేయమని చెప్పింది. ఒకవేళ కేసులో లోకేష్ పేరు చేర్చినా 41ఏ నిబంధనలు అనుసరిస్తామని చెప్పారు సీఐడీ తరుఫు లాయర్లు. అనంతరం ఉన్నత న్యాయస్థానం కేసును డిస్పోజ్ చేస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. దీంతో నారా లోకేష్ కు రిలీఫ్ దొరికినట్టు అయింది.
పూర్తిగా చదవండి..NARA LOKESH:స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా లోకేష్ కు ఊరట
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా లోకేష్ కు ఊరట అభించింది. ఈ కేసును ఏపీ హైకోర్టు క్లోజ్ చేసేసింది. లోకేష్ ను ముద్దాయిగా కేసులో చేర్చలేదని సీఐడీ చెప్పింది. ముద్దాయిగా లేని వారిని అరెస్ట్ చేయమని కూడా చెప్పింది.
Translate this News: