పండగలకు రిలీజ్ అయ్యే సినిమాల మీద మంచి క్రేజ్ ఉంటుంది. అందులోనూ దసరా, సంక్రాంతి పండగల కోసం తమ సినిమాలను ప్రత్యేకంగా రిజర్వ్ చేసుకుంటారు మూవీ మేకర్స్. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో దసరా వస్తోంది. దీంతో భారత్లో పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్లుపెట్టుకున్నాయి. ఈ ఏడాది ఈ రేసులో 5 సినిమాలు ఉన్నాయి.అందులో నాలుగు పాన్ ఇండియా రేంజ్ సినిమాలు కాగా, ఒక్కటి మాత్రం తెలుగులో విడుదల అవుతోంది. కోలీవుడ్ నుంచి ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన లియో మూవీ థియేటర్స్ లోకి అక్టోబర్ 19న వస్తోంది. అదే రోజు భగవంత్ కేసరి తెలుగులో రిలీజ్ అవుతోంది.అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. కన్నడం నుంచి సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ మూవీ అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ నుంచి టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన గణపత్ మూవీ అక్టోబర్ 20న థియేటర్స్ లోకి వస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఈ చిత్రం రిలీజ్ అవ్వనుంది.
పూర్తిగా చదవండి..MOVIES:దసరా బరిలో ఐదు సినిమాలు…హిట్ కొట్టేది ఏదో?
దసరా బరిలో ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నాలుగు చిత్రాలు పాన్ ఇండియా బ్రాండ్ తో వస్తూ ఉండగా ఒక్క బాలయ్య మూవీ మాత్రమే తెలుగులో రిలీజ్ అవుతోంది. లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్లో వస్తున్న లియో, రవితేజ ట్రైగర్ నాగేశ్వర్రావులు ఇందులో ఉన్నాయి.
Translate this News: