Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగ నుంచి ప్రారంభం అవుతుంది.అసలు ఈ ఉగాది పర్వదినాన్ని ఎలా జరుపుకుంటారు...ఈరోజున చేసుకునే ప్రత్యేకమైన ఉగాది పచ్చడి దేనికి సంకేతాలు అనేదిఈ కథనంలో..

author-image
By Bhavana
New Update
ugadi pachadi

ugadi pachadi

ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి తొలి పండుగ. తెలుగు వారి కొత్త సంవత్సరం ఈ రోజు నుంచే మొదలు కాబోతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్విదినానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణాన్ని కూడా చేస్తారు. మరికొన్ని రోజుల్లో క్రోథి నామ సంవత్సరానికి ముగింపు పలికి 'విశ్వావసు' నామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని అంతా నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యవాతరం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అందరూ నమ్ముతారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని ప్రతీతి. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే మొదలవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటారు.
శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో పురాణ గాధ కూడా ఉంది. 'ఉగాది', 'యుగాది' అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి.

Also Read: Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

 'ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. అది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది.

తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు. ఉగాది రోజు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది షడ్రుచుల ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను తెలియజేస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో దాడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, ప్రతీక.

బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక
ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు
చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు- వగరు - కొత్త సవాళ్లు
కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు

Also Read: Dr BR. Ambedkar:అంబేడ్కర్ జయంతికి పబ్లిక్ హాలీడే.. కేంద్రం అధికారిక ప్రకటన!

Also Read: Wife Cheating: మేనల్లుడితో అక్రమ సంబంధం.. కాఫీలో విషం కలిపి భర్తపై భార్య దారుణం!

ugadi | UGADI 2025 | ugadi-festival | ugadi-pachadi | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు