Dr BR. Ambedkar:అంబేడ్కర్ జయంతికి పబ్లిక్ హాలీడే.. కేంద్రం అధికారిక ప్రకటన!

భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. బాబా సాహెబ్ జయంతిని పబ్లిక్ హాలీడేగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ ఆఫీసులు ఏప్రిల్ 14న సెలవు పాటించాలని సూచించింది. 

New Update
Ambedkar Jayanti: సమసమాజ స్వాప్నికుడు.. న్యాయ కోవిదుడి జయంతి నేడు!

Dr.BR Ambedkar Jayanti declared public holiday

Dr BR. Ambedkar: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇకపై బాబా సాహెబ్ జయంతిని పబ్లిక్ హాలీడేగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు ఏప్రిల్ 14న సెలవు ఇవ్వాలని సూచించింది. 

దేశానికి చేసిన శాశ్వత కృషి..

ఈ మేరకు డాక్టర్ అంబేడ్కర్ దేశానికి చేసిన శాశ్వత కృషికి గుర్తింపుగా ఈ సెలవు దినం పాటించాలని తెలుపుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమోరాండం రిలీజ్ చేసింది. బాబా సాహెబ్ జయంతి సందర్భంగా 2025 ఏప్రిల్1న దేశం అంతటా పారిశ్రామిక సంస్థలు సహా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. 
ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

Also Read: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు

'సమాజంలో సమానత్వం కొత్త శకాన్ని స్థాపించిన రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జీ జయంతి సందర్భంగా ఇకపై ప్రభుత్వ సెలవుదినం. అంబేడ్కర్ నమ్మకమైన అనుచరుడు. ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశ ప్రజల మనోభావాలను గౌరవించారు' అంటూ మంత్రి గజేంద్ర కొనియాడారు. 

Also Read: భూకంపం ఎఫెక్ట్.. 100 దాటిన మృతుల సంఖ్య

 holiday | birthday | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు