Wife Cheating: మేనల్లుడితో అక్రమ సంబంధం.. కాఫీలో విషం కలిపి భర్తపై భార్య దారుణం!

ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లో దారుణం జరిగింది. మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న పింకీ తన భర్త అనుజ్‌ను చంపేందుకు ప్లాన్ చేసింది. కాఫీలో విషం కలిపి ఇచ్చింది. అనుజ్ పరిస్థితి విషయమంగా ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

New Update
up crime

Uttar Pradesh Wife gives poisoned coffee to husband for lover

Wife Cheating: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ భార్య చేసిన అవమానకరమైన చర్య వెలుగులోకి వచ్చింది. ఖతౌలిలోని భయాంగి గ్రామంలో పింకీ శర్మ తన ప్రేమికుడి కోసం తన భర్త అనుజ్ శర్మకు విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించింది. అనుజ్ ను మీరట్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విరాలు ఇలా ఉన్నాయి. 

చాలాసార్లు చంపేందుకు కుట్ర.. 

ఈ మేరకు పింకీ పెళ్లైన రెండు నెలలకే తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించిందని అనుజ్ శర్మ బంధువు పూనమ్ శర్మ తెలిపారు. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. దీంతో పింకీ గతంలో చాలాసార్లు అనుజ్‌ను చంపేస్తానని బెదిరించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పింకీ, ఆమె ప్రియుడి మనాలి పర్యటనకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను కూడా ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు అందజేశారు. పింకీ పెళ్లికి ముందే తన మేనల్లుడితో ప్రేమలో ఉందని, పెళ్లి తర్వాత కూడా అతనితో సంబంధం కొనసాగిస్తుందని ఆరోపణలు ఉన్నాయి.

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

కాఫీలో విషం కలిపి భర్తతో తాగించి..

గొడవ జరిగిన రాత్రి పింకీ కాఫీ తయారు చేసి అనుజ్‌కి తాగడానికి ఇచ్చిందని అనుజ్ బంధువు పూనమ్ చెప్పింది. అనుజ్ తాగిన వెంటనే అతని ఆరోగ్యం క్షీణించింది. అతను వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీని తరువాత అతన్ని ఖతౌలి ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ నుండి మీరట్ కు సూచించారు. ప్రస్తుతం అతను చావుబతుకుల్లో ఉన్నారని కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంలో బాధితుడు అనుజ్ కుటుంబం పింకీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నారు. పింకీ కాల్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Also read: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!

uttarpradesh | coffee | telugu-news | today telugu news | rtv telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు