Gujarat : భారీ వర్షాలకు గుజరాత్ అతలాకుతలం.. రెడ్ అలర్ట్ జారీ..!
గుజరాత్‌కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో వల్సాడ్, తాపి, నవ్సారి, సూరత్, నర్మదా, పంచమహల్ జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మరో 2 రోజులపాటు వర్షాలు ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.