AP Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరోసారి భారీ వర్షాలు

ఏపీలో ఈ నెల 23వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి ఆర్.పి.సిసోడియా తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

New Update
rains 2

బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి ఆర్.పి.సిసోడియా తెలిపారు. మృత్సకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు కూడా వర్షం సమయంలో పొలాల్లో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్!

మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని..

ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫాన్‌గా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలుపుతోంది.

ఇది కూడా చూడండి: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

 ఈ అల్పపీడనం ఈ నెల 26 లేదా 27నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా వస్తుందని అధికారులు అంటున్నారు. ఈ ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ సమయంలో ఎవరూ బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఇది కూడా చూడండి:  బద్దశ‌త్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా?

ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా కూడా విసురుతోంది. గతంలో కంటే ఇప్పుడు చలి తీవ్రత కూడా పెరిగింది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో అయితే సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు చాలా ప్రాంతాల్లో పొగ మంచు కప్పేస్తోంది. పొగమంచు కారణంగా రహదారులపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి:  AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు