Fengal Cyclone: తీరాన్ని తాకిన ఫెంగల్..ఏపీ, తమిళనాడుకు రెడ్ అలెర్ట్

ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని తాకింది. మహాబలిపురం–కరైకల్ మధ్యలో తుఫాన్ తీరం దాటడం మొదలైందని వాతావరణశాఖ చెప్పింది. దీని ప్రభావం వలన ఈదురు గాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. 

author-image
By Manogna alamuru
New Update
cyclone

దంచికొట్టిన ఫెంగల్ తుఫాన్ ఒత్తానికి తీరం దాటుతోంది. మూడు రోజుల పాటూ ఏపీ, తమిళనాడు ప్రజలను వణికించిన ఈ తుఫాన్  మహాబలిపురం–కరైకల్ మధ్యలో పుదుచ్చేరి సమీపంలో తీరం దాటుతోంది. ఈ మొత్తం ప్రక్రియకు నాలుగు గంటలు పట్టవచ్చని భారత వాతావరణ శాఖ చెప్పింది. తుపాను తీరం దాటే సమయంలో 70 నుంచి 80 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని.. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలతో పాటు ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణసంస్థ అధికారులు తెలిపారు. 

ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో మూడ్రోజులుగా..

తుఫాన్ కారణంగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, విలుప్పురం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. వీటివల్ల  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయాయి. ఎయిర్‌పోర్ట్‌లో భారీగా నీళ్ళు నిలిచి పోయాయి. దీంతో చెన్నైకి  విమాన సర్వీసులు నిలిపేశారు. దాంతో పాటూ రైల్వే ట్రాక్‌లపైకి వరద నీరు చేరడంతో..ఎలక్ట్రిక్‌ ట్రైన్ సర్వీసులు పూర్తిగా రద్దు చేశారు. విమాన, రైల్వే సేవలు నిలిపివేయడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఇప్పుడు తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం  ఉండడంతో..తిరువళ్లూరు, కాంచీపురం, విలుప్పురం జిల్లాలకు ఐఎమ్‌డీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఏపీలో చిత్తూరు, తిరుపతి రాష్ట్రాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. 

Also Read: Holidays: బ్యాంకులకు నెలలో సగంపైనే హాలిడేస్... ఎంజాయ్ డిసెంబర్

Advertisment
Advertisment
తాజా కథనాలు