Weather Update: బిగ్ అలర్ట్.. 24 గంటల పాటు ఈ జిల్లాల్లో ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు!

క్యూములోనింబస్ మేఘాల కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు  కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసరం అయితేనే ప్రజలకు బయటకు వెళ్లాలని సూచించారు.

New Update
Rains In Telugu States

Rains

క్యూములోనింబస్ మేఘాల కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు  కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసరం అయితేనే ప్రజలకు బయటకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మరో రెండు గంటల్లో కుండపోత వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

ఇది కూడా చూడండి: BREAKING: ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీలో 50 మంది ఇంటర్ స్టూడెంట్లు!

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

హైదరాబాద్‌లో చిన్న వర్షానికే ఫుల్‌గా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అలాంటిది కుండపోత వర్షాలు కురిస్తే ఎక్కడిక్కడ ట్రాఫిక్ ఫుల్ అవుతుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని తెలిపారు. అయితే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, రంగారెడ్డి, సిద్ధిపేట్, వనపర్తిలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ విషయానికొస్తే మాదాపూర్, యూసఫ్‌గూడ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, పఠాన్‌చెరువు, మియాపూర్, సికింద్రాబాద్, అమీర్‌పేట, బేగంపేట, ప్రకాష్ నగర్, దిల్‌సుఖ్ నగర్, ఎల్‌బీనగర్, మలక్‌పేట, ఎంజీబీఎస్, చాదర్‌ఘడ్, అఫ్జల్ గంజ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. 

ఇది కూడా చూడండి: SMS Hospital Fire Accident Videos: సంచలన వీడియోలు.. మంటల్లో కాలిబూడిదైన హాస్పిటల్ ICU వార్డ్..

Advertisment
తాజా కథనాలు