SMS Hospital Fire Accident Videos: సంచలన వీడియోలు.. మంటల్లో కాలిబూడిదైన హాస్పిటల్ ICU వార్డ్..

జైపూర్‌లోని SMS హాస్పిటల్ ట్రామా సెంటర్‌ ఐసీయూలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు రోగులు మరణించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సీఎం భజన్‌లాల్ శర్మ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వీడియోలు వైరల్‌గా మారాయి.

New Update
SMS Hospital Fire Accident In Rajasthan Jaipur

SMS Hospital Fire Accident In Rajasthan Jaipur

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘోరమైన అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సవాయి మాన్ సింగ్ హాస్పిటల్ (SMS)లోని రెండవ అంతస్తులో ఉన్న ICU వార్డులో మంటలు వ్యాపించాయి. దీంతో ICU వార్డులో ఉన్న దాదాపు ఆరుమంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 5 మంది పేషెంట్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆ సమయానికి సుమారు 24 మంది పేషెంట్లు ICU వార్డులో ఉన్నారు. 

SMS Hospital Fire Accident Videos

మంటలు అంటుకున్న వెంటనే గమనించిన హాస్పిటల్ సిబ్బంది, పేషెంట్ల కుటుంబ సభ్యులు రోగులను బయటకు తీసుకెళ్లారు. అనంతరం రోడ్లపైనే పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించారు. అక్కడ వారిని బెడ్‌లపై ఉంచి ఆక్సిజన్ ఏర్పాటుచేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ ప్రమాదం షార్ట్‌ సర్క్యూట్ కారణంగా జరిగినట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు