BIG BREAKING: దిశ మార్చుకున్న మొంథా తుపాను.. తీరం దాటడంలో ట్విస్ట్

అనుహ్యంగా మొంథా తుపాను తీరం దాటే దిశను మార్చుకుంది. కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం దగ్గర తీరం దాటనుంది ఈ తుపాను. రాబోయే 3, నాలుగు గంటలు అత్యంత కీలకమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తీరం దాటడానికి ఆరు గంటలు పట్టే ఛాన్స్ ఉంది.

New Update
monthacyclone

మొంథా.. ప్రస్తుతం ఈ పేరే ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలను వణికిస్తోంది. మొంథా తుఫాన్ కారణంగా మూడు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ అల్పపీడనం.. తీవ్రంగా బలపడి మరికొన్ని గంటల్లో కాకినాడ వద్ద తీరం దాటాల్సి ఉంది. అనుహ్యంగా మొంథా తుపాను తీరం దాటే దిశను మార్చుకుంది.

కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం లేదా అమలాపురం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. రాబోయే మూడు, నాలుగు గంటలు అత్యంత కీలకమని ఃఅధికారులు హెచ్చరిస్తున్నారు. తీరం దాటడానికి ఆరు గంటలు పట్టే ఛాన్స్ ఉంది. మొంథా తుపాను ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుఫాను తీరాన్ని తాకింది. ఈ తుపాను పూర్తిగా తీరం దాటడానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం.. తుఫాన్ కాకినాడ సమీపంలోని రాజోలు - అల్లవరం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisment
తాజా కథనాలు