/rtv/media/media_files/2025/08/12/coolie-vs-war-2-advance-bookings-2025-08-12-10-30-47.jpg)
Coolie vs War 2 Advance Bookings
Coolie vs War 2 Bookings:
ఈ వారం సినీప్రియులకు పండగే... ఎందుకంటే ఆగస్టు 14న రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) ‘కూలీ’, మరోవైపు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన 'వార్ 2'. అయితే ఈ రెండు సినిమాల మధ్య ఇప్పటికే బాక్సాఫీస్ పోటీ మొదలైంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్‌లో రజనీకాంత్ సినిమా 'కూలీ' సినిమా దూసుకెళ్తోంది..
అయితే తాజా లెక్కల ప్రకారం, హృతిక్ - ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' కు దేశవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లు దక్కాయి. వార్ 2 కి మొత్తం 8,510 షోలు ఉండగా, కూలీకి 7,338 షోలు ఉన్నాయి. షోలు తక్కువ ఉన్నప్పటికీ, టిక్కెట్ల సేల్స్ మాత్రం కూలీ దుమ్ము దులుపుతోంది.
డే 1 అడ్వాన్స్ బుకింగ్స్‌లో(Coolie vs War 2 Advance Bookings) వార్ 2 ఇప్పటివరకు 1,26,287 టిక్కెట్లు మాత్రమే బుక్ అవ్వగా, కూలీ మాత్రం 8,35,850 టిక్కెట్లు సేల్స్ జరిగింది. ఇది గమనిస్తే, కూలీ టికెట్లు వార్ 2 కంటే 561.7% ఎక్కువగా అమ్ముడయ్యాయి.
Also Read: ఇది కదా రజినీ క్రేజ్..! ఉద్యోగులకు సెలవు, ఫ్రీ టికెట్స్...
కలెక్షన్స్ పరంగా చూస్తే, వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ₹4.11 కోట్ల వసూళ్లు చేసింది. బ్లాక్ సీట్లు కలిపితే ₹8.54 కోట్లు దాటే అవకాశముంది. అదే సమయంలో కూలీ మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ₹17.72 కోట్లు కలెక్ట్ చేసింది". బ్లాక్ సీట్లు కలుపుకుంటే ఈ మొత్తం ₹24.28 కోట్లు అవుతుంది.
ఇక విడుదల విషయానికి వస్తే, వార్ 2 హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇందులో 2D, IMAX, 4DX వంటి ఫార్మాట్లు ఉన్నాయి. ఇక కూలీ సినిమా తమిళ్‌లో రూపొందించగా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కూలీ కేవలం 2D ఫార్మాట్‌లోనే విడుదల కానుంది.
వార్ 2 సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలతో CBFC నుండి U/A 16+ సర్టిఫికేట్ పొందింది, అయితే కూలీ సినిమా మాత్రం ‘A’ సర్టిఫికేట్‌తో వస్తోంది, దీని నిడివి 2 గంటల 48 నిమిషాలు.
వార్ 2 సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది.
Also Read: ‘కూలీ’కి ఇక్కడ 'A' సర్టిఫికెట్.. అక్కడ మాత్రం U/A.. షాక్ లో తలైవా ఫ్యాన్స్..!
ఇక కూలీ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, సౌబిన్ షాహీర్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
మొత్తంగా చూస్తే, బుకింగ్స్ పరంగా రజనీకాంత్ సినిమా ‘కూలీ’ ఇప్పటికే టాప్ ప్లేస్ దక్కించుకుంది. అయినప్పటికీ, విడుదలరోజు వరకు ఈ పోటీ ఇంకా ఆసక్తికరంగా మారనుంది. అయితే రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.