Heavy Rain In Hyderabad : హైదరాబాద్‌లో కుండపోత వర్షం..ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్

హైద‌రాబాద్ లో మ‌రోసారి వ‌ర్షం దంచికొడుతుంది. ఈదురుగాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురుస్తుంది. ఓ ప‌క్క భారీ వ‌ర్షం కురుస్తుండగా, మ‌రోవైపు ఈదురుగాలులతో నగరమంతా అతలాకుతలమైంది. దీంతో న‌గ‌ర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

New Update
rains

Heavy Rain In Hyderabad


Heavy Rain In Hyderabad : హైద‌రాబాద్ లో మ‌రోసారి వ‌ర్షం దంచికొడుతుంది. ఈదురుగాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురుస్తుంది. ఓ ప‌క్క భారీ వ‌ర్షం కురుస్తుండగా, మ‌రోవైపు ఈదురుగాలులతో నగరమంతా అతలాకుతలమైంది. దీంతో న‌గ‌ర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వ‌ర‌ద నీటితో మునిగిపోయాయి. ప‌లు చోట్ల విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  గంట నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షం కారణంగా ప‌లు చోట్ల రోడ్లు వ‌ర‌ద నీటితో నిండిపోయాయి. అందరూ ఆఫీసుల నుంచి వచ్చే సమయానికి వర్షం కురవడంతో వాహనదారులు రోడ్లపై చిక్కుకుపోయారు. ర‌హ‌దారుల‌పై భారీగా వాహ‌నాలు నిలిచిపోవడంతో  ప‌లు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీసుల నుంచి నివాసాల‌కు వెళ్లే  సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ ప్రయాణం కోసం గంటల సమయం పడుతోంది. 

ఇది కూడా చదవండి:మరోసారి ఉత్తరాఖండ్‌లో భారీ క్లౌడ్ బరస్ట్.. శిథిలాల కింద వందలాది కుటుంబాలు?

నగరంలోని మాదాపూర్‌, జూబ్లిహిల్స్‌, హైటెక్ సిటీ..బంజారాహిల్స్‌, యూసఫ్‌గూడలో భారీ వర్షం కురుస్తోంది. అమీర్‌పేట, మణికొండ, పంజాగుట్ట  సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌  తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. ఉదయమంతా ఎండ తీవ్రత ఉండి సాయంత్రానికి ఒకసారిగా కుండపోత వర్షం కురవడంతో వాహనదారులు ఫ్లై ఓవర్ల కింద, బస్ స్టాప్‌ల వద్ద తలదాచుకున్నారు. కృష్ణాన‌గ‌ర్, మ‌ధురాన‌గ‌ర్, స‌న‌త్‌న‌గ‌ర్, ఎస్సార్ న‌గ‌ర్, మాస‌బ్‌ట్యాంక్, గ‌చ్చిబౌలి, ల‌క్డీకాపూల్, బేగంపేట్, సోమాజిగూడ‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షం కురుస్తోంది.ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, నారాయణగూడ,  అంబర్ పేట్, కాచిగూడ, ఓయూ క్యాంపస్, విద్యానగర్,  ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గడచిన గంట నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి.  కాగా, భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని నగర వాసులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అవసరం ఉంటేనే తప్ప బయటకు రావద్దని స్పష్టం చేసింది.


సెప్టెంబర్ 2 వరకు తెలంగాణలో వర్షాలు


రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 2వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు(శనివారం) ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది.

Also Read :   Indian Students: అమ్మో.. నేను పోను అమెరికాకు.. వీసా రూల్స్ తో వణుకుతున్న స్టూడెంట్స్!

Advertisment
తాజా కథనాలు