/rtv/media/media_files/2025/10/29/minister-nara-lokesh-directs-key-instructions-to-cyclone-effected-district-collectors-2025-10-29-19-30-21.jpg)
Minister Nara Lokesh Directs Key instructions to Cyclone Effected district collectors
తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాను ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని తుపాను ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. '' వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వర్షాల వల్ల రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించడం కోసం అగ్నిమాపక శాఖ చర్యలు తీసుకోవాలి.
Also Read: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. లొంగిపోయిన 51 మంది మావోలు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు 100 శాతం విద్యుత్‌ను పునరుద్ధరించాలి. వర్షాలకు దెబ్బతిన్న వివిధ రకాల పంటలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే పాటు పంట నష్టం అంచనాలను రూపొందించాలి. తుఫాను ప్రభావంతో జరిగిన ప్రాణనష్టం, దెబ్బతిన్న నిర్మాణాలపై కూడా నివేదిక అందించాలి. వంతెనలు, కల్వర్టులను పర్యవేక్షించాలి. దీంతో పాటు వర్షాల ప్రభావానికి దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాలువగట్లను పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
Also Read: దారుణం.. పొలాల్లోకి లాక్కెళ్లి 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రే*ప్
ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు రాకుండా ఉండేందుకు ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టాలి. పాముకాటుకు వినియోగించే యాంటీ వీనం ఔషధాలు అందుబాటులో ఉండాలి. పారిశుద్ధ్యం నిర్వహణతో పాటు ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లోని బాధితులకు సురక్షితమైన తాగునీరు అందించాలి. మత్స్యకారులు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులందరికీ కావాల్సిన నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని'' మంత్రి లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో హోంమంత్రి అనిత, సీఎస్ కె.విజయానంద్, ఆర్టీజీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ కూడా పాల్గొన్నారు.
Also Read: అధైర్య పడొద్దు.. అండగా ఉంటా.. తుఫాన్ బాధితులకు చంద్రబాబు భరోసా-PHOTOS
Follow Us