/rtv/media/media_files/2024/12/17/wJzsdG0WEh17U8o3yNaP.jpg)
Weather update
దేశ వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లోని జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా తినడానికి తిండి, తాగడానికి నీరు, ఉండటానికి ఇల్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు మూడువారాలుగా భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.
మరో 6 రోజులు దంచుడే (Weather Update)
ఆగస్టు 9 వరకు అంటే రాబోయే 6 రోజుల పాటు ఉత్తర, తూర్పు, పశ్చిమ, మధ్య భారతదేశంలో భారీ వర్షాలు, తుఫాను గాలులు ఉంటాయని తెలిపింది. అదే సమయంలో ఈశాన్య, తూర్పు భారతదేశంలో రాబోయే 6 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆగస్టు 5న తమిళనాడు, కేరళలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో రాబోయే 4-5 రోజుల పాటు మధ్య, ఉత్తర ద్వీపకల్ప భారతదేశంలో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
#WATCH | Delhi | Waterlogging in parts of the national capital following a spell of rain.
— ANI (@ANI) August 2, 2025
(Visuals from Panchkuian Marg) pic.twitter.com/Im77ERO6Ps
ఆగస్టు 3న ఆదివారం తెల్లవారుజామున కూడా ఢిల్లీతో పాటు దాని పక్కనే ఉన్న నోయిడాలో భారీ వర్షాలు కురిశాయి. అనేక ప్రాంతాల్లో జలమయం అయ్యాయి. రోడ్లపై కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇలా ఆగస్టు 9 వరకు ఢిల్లీలో వాతావరణం ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఇతర రాష్ట్రాలైన.. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలలో ఆగస్టు 4 నుంచి 9 మధ్య భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.
ఆగస్టు 4, ఆగస్టు 6, 9 మధ్య అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అదే సమయంలో ఆగస్టు 4, ఆగస్టు 7-9 తేదీలలో అస్సాం, మేఘాలయలో కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా తూర్పు, మధ్య భారతదేశంలో ఆగస్టు 4 నుండి 9 వరకు ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్‌లలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఆగస్టు 4, 5 తేదీలలో పశ్చిమ మధ్యప్రదేశ్‌లో, ఆగస్టు 4, 9 తేదీలలో తూర్పు మధ్యప్రదేశ్‌లో, ఆగస్టు 8, 9 తేదీలలో ఛత్తీస్‌గఢ్‌లో, ఆగస్టు 6, 7 తేదీలలో ఒడిశాలో, ఆగస్టు 7న గంగా తీర పశ్చిమ బెంగాల్‌లో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.