Cinema: మరోసారి థియేటర్లలోకి మాయాబజార్..ఎన్టీయార్ వర్థంతి రోజు

తెలుగు సినిమాకు మకుటం మాయాబజార్. ఎప్పటికీ నిలిచిపోయే ఈ క్లాసిక్ ను రీరిలీజ్ చేయనున్నారు. ఈ నెల 28న సీనియర్ ఎన్టీయార్ జయంతి రోజున మాయాబజార్ రీరిలీజ్ చేయనున్నారు. నిన్న దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

author-image
By Manogna alamuru
New Update
cinema

Mayabazar

ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి వంటి దిగ్గ‌జ న‌టీన‌టులు ప్రధాన పాత్రల్లో నటించిన గొప్ప పౌరాణిక చిత్రం మాయాబజార్. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి ఈ చిత్రాన్ని అత్యంత అద్భుతంగా తెరకెక్కించారు, దర్శకుడు కె.వి.రెడ్డి మాయాబజార్ ను ఓ సెల్యులాయిడ్ కావ్యంగా  మ‌లిచారు.గ్రాఫిక్స్ అనే మాటే పుట్టని రోజుల్లో తీసిన మాయాబజార్ వెండితేర మీద అద్భుతాలను ఆవిష్కరించింది. 1957 మార్చి 27న విడుదైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అప్పటి నుంచి ఎన్నో తరాల ప్రశంసలను అందుకుంటూనే ఉంది. ఈ సినిమాలో ప్రతీ క్రాఫ్ట్ ఒక స్టడీ మెటీరియల్ గా ఉపయోగపడుతుంది. మాయాబజార్ కు పింగళి నాగేందర్రావు మాటలను రాస్తే...ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్ లే దాన్ని నవరసభరితంగా తెరమీద చూపించారు. 

కలర్ లో రీరిలీజ్..

ఇలాంటి అద్భుతమై మాయాబజార్ తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు మళ్ళీ రాబోతోంది. ఎన్టీయార్ 102వ జయంతి సందర్భంగ దీనిని మళ్ళీ రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 28న ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతోంది. ఈ సారి కలర్ లో మాయాబజార్ ను పెద్ద తెర మీద చూడవచ్చును. దీనికి సంబంధించిన నిన్న ప్రీరిలీజ్ ఈ వెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మాయాబజార్ సినిమాను మరోసారి థియేటర్ లో చూడడం మరుపురాని ఎక్స్ పీరియన్స్ అని ఎస్వీకృష్ణారెడ్డి అన్నారు. నేటి ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ మాయాబ‌జార్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ ని స్ట‌డీ చేస్తే అది వారికి చాలా స‌హ‌క‌రిస్తుందని చెప్పారు. ప్ర‌ఖ్యాత పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ విద్యార్థుల కోసం మేటి క్లాసిక్ `మాయాబ‌జార్` స్క్రీన్ ప్లే పై ప్ర‌త్యేకంగా క్లాసు చెప్తారని చెప్పారు.

 

today-latest-news-in-telugu | cinema | re-release | telugu | classical-music-artist 

Also Read: Israel-Iran: ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు..అమెరికాకు నిఘా సమాచారం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు