/rtv/media/media_files/2025/10/19/akhilesh-2025-10-19-16-37-44.jpg)
Akhilesh Yadav : సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. దీపావళి వేడుకలపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీపాలు, కొవ్వొత్తులపై డబ్బు ఖర్చు చేయవద్దని, క్రిస్మస్ పండుగ జరుపుకునే విధానం నుంచి నేర్చుకోవాలని ఆయన సూచించారు. దీంతో ఆయనపై విశ్వ హిందూ పరిషత్ (VHP) సహా పలు హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఇది కూడా చదవండి: తెల్లటి ఆహార పదార్థాలు విషమా లేక అమృతమా..!!
ఒక సభలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, అయోధ్యలో దీపోత్సవ్ సందర్భంగా లక్షల దీపాలు వెలిగించడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు: "నేను శ్రీరాముడి పేరు మీద ఒక సలహా ఇస్తాను. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా అన్ని నగరాలు అద్భుతంగా వెలిగిపోతాయి. ఆ లైట్లు నెలల తరబడి ఉంటాయి. మనం వారి నుంచి నేర్చుకోవాలి. దీపాలు, కొవ్వొత్తుల కోసం డబ్బు ఎందుకు ఖర్చు చేయాలి? ఈ ప్రభుత్వం నుంచి మనం ఏం ఆశించగలం? ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. మేము అధికారంలోకి వస్తే మరింత అందమైన లైట్లు ఉండేలా చూసుకుంటాము." అని అన్నారు.
ఇది కూడా చదవండి: తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి
అఖిలేష్ వ్యాఖ్యలపై ఫైర్
అఖిలేష్ వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ (VHP) జాతీయ ప్రతినిధి వినోద్ బన్సల్ తీవ్రంగా మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్ హిందువుల కంటే క్రైస్తవులనే ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు కనిపిస్తోందని, ఇది భారతీయ సంస్కృతిపై దాడి చేయడమేనని వినోద్ బన్సల్ విమర్శించారు. ఎస్పీ హయాంలో అయోధ్యను చీకట్లో ఉంచారని, ఇప్పుడు అయోధ్య వెలిగిపోతుంటే అఖిలేష్‌కు ఇబ్బందిగా ఉందని బిజెపి జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. బహుశా అందుకే ప్రజలు ఆ పార్టీని సమాజ్ వాదీ పార్టీ అని పిలవరు కానీ అసమాజ్ వాదీ పార్టీ (సామాజిక వ్యతిరేక పార్టీ) అని పిలుస్తారని విమర్శించారు. మొత్తం మీద, దీపావళి సందర్భంగా దీపాలను, కొవ్వొత్తులను విమర్శిస్తూ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి.
ఇది కూడా చదవండి: సోన్ పాపిడి మిఠాయి పుట్టింది మన దేశంలోనేనా..?